Salman Khan : పవర్ స్టార్ సినిమాపై మనసుపడిన సల్మాన్.. ఆ మూవీని హిందీలోకి..

|

Sep 15, 2022 | 7:35 PM

ఒక భాషలో సూపర్ హిట్ అయినా సినిమాలు వేరే భాషలోకి రీమేక్ అవ్వడం చాలా కామన్. ముఖ్యంగా సౌత్ సినిమాలు బాలీవుడ్ లో ఎక్కవగా రీమేక్ అవుతూ ఉంటాయి.

Salman Khan : పవర్ స్టార్ సినిమాపై మనసుపడిన సల్మాన్.. ఆ మూవీని హిందీలోకి..
Salman Khan Pawan Kalyan
Follow us on

ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాలు వేరే భాషలోకి రీమేక్ అవ్వడం చాలా కామన్. ముఖ్యంగా సౌత్ సినిమాలు బాలీవుడ్ లో ఎక్కవగా రీమేక్ అవుతూ ఉంటాయి. మన తెలుగు సినిమాలు చాలా వరకు అక్కడ రీమేక్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచాయి. రీసెంట్ గా అర్జున్ రెడ్డి, జెర్సీ సినిమాలు కూడా బాలీవుడ్ లో రీమేక్ అయ్యాయి. అలాగే రాక్షసుడు సినిమా కూడా రీమేక్ అయ్యి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు సినిమాలపై ఎక్కువగా కండల వీరుడు సల్మాన్ ఖాన్(Salman Khan) మక్కువ చూపుతూ ఉంటాడు. ఇప్పటికే మహేష్ నటించిన పోకిరి సినిమాను రీమేక్ చేసి సాలిడ్ హిట్ అందుకున్నాడు. అలాగే రెడీ లాంటి సినిమాకు సల్లుభాయ్ కి మంచి హిట్ అందించింది. ఇప్పుడు మరోసారి తెలుగు సినిమాను అక్కడ రీమేక్ చేయాలనీ చూస్తున్నాడు సల్మాన్.

ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయాలనీ చూస్తున్నాడు సల్మాన్. పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమాను హిందీలో చేయనున్నాడట సల్మాన్. నిజానికి ఇది మన తెలుగు సినిమా కాదు. తమిళ్ లో అజిత్ హీరోగా వీరం అనే టైటిల్ తో తెరకెక్కి సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే వెంటనే తెలుగులో వీరుడొక్కడే అనే టైటిల్ తో డబ్ అయ్యింది. అయినా కూడా పవన్ ఈ సినిమాను రీమేక్ చేశారు. ఇప్పుడు ఇదే సినిమాను సల్మాన్ హిందీలో చేయనున్నాడని బీటౌన్ టాక్. తెలుగులో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయిన ఈ మూవీ అక్కడ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి