Salman Khan; టాలీవుడ్ హీరోయిన్‌తో సల్మాన్ ఖాన్ డేటింగ్… క్లారిటీ ఇచ్చిన సల్లూభాయ్ ఫ్రెండ్స్

|

Dec 14, 2022 | 7:45 AM

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇప్పటికే చాలా మందితో లవ్ లో పడ్డాడన్న విషయం తెలిసిందే. అలాగే చాలా మంది హీరోయిన్స్ తో డేటింగ్ చేశాడన్న వార్తలు కూడా ఉన్నాయి.

Salman Khan; టాలీవుడ్ హీరోయిన్‌తో సల్మాన్ ఖాన్ డేటింగ్... క్లారిటీ ఇచ్చిన సల్లూభాయ్ ఫ్రెండ్స్
Salman Khan
Follow us on

సినిమా తరాల గురించి ఎదో ఒక న్యూస్ నిత్యం చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ఇక సెలబ్రెటీల రిలేషన్స్ షిప్స్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా బాలీవుడ్ లో ఇలాంటి వార్తలు కోకొల్లలు. తాజాగా మరోసారి ఇలాంటి వార్తే ఇప్పుడు బాలీవుడ్ లో తెగ చక్కర్లు కొడుతుంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇప్పటికే చాలా మందితో లవ్ లో పడ్డాడన్న విషయం తెలిసిందే. అలాగే చాలా మంది హీరోయిన్స్ తో డేటింగ్ చేశాడన్న వార్తలు కూడా ఉన్నాయి. తాజాగా సల్మాన్ మరో బ్యూటీతో డేటింగ్ చేస్తున్నాడట.ఆ అమ్మడు ఎవరో కాదు టాలీవుడ్ కు బాగా కావాల్సిన హీరోయిన్. ఇంతకు ఆ బ్యూటీ ఎవరో తెలుసా.. మన బుట్టబొమ్మ పూజాహెగ్డే. గత కొద్ది రోజులకు బాలీవుడ్ మీడియాలో సల్మాన్ ఖాన్ పూజా హెగ్డే ఇద్దరు కూడా డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు షికారు చేస్తున్నాయి.

ఇక వీరిద్దరి రిలేషన్ గురించి వార్తలు జోరుగా ప్రచారం జరుగుతుంటడంతో .. అక్కడి ప్రముఖ క్రిటిక్ కేఆర్కె.. కూడా ఈ విషయం పై స్పందించాడు. త్వరలోనే ఈ ఇద్దరు గుడ్ న్యూస్ చెప్పనున్నారంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేశాడు. దాంతో సల్మాన్ . పూజా డేటింగ్ వార్తలకు మరింత బలం చేకూరింది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే ఈ వార్తలపై సల్మాన్ సన్నిహితులు స్పందించారు. ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చి చెప్పారు. పూజ సల్మాన్ ఇద్దరు డేటింగ్ లో ఉండటమేంటీ.. కలిసి నటిస్తే ఇలా వార్తలు పుట్టిస్తారా..? ఇలాంటి బాధ్యత రహితమైన వార్తలను వ్యాప్తి చేసేవారు కాస్త సిగ్గుతో తలదించుకోవాలి అంటూ ఈ వార్తలకు చెక్ పెట్టారు. ప్రస్తుతం పూజ హెగ్డే సల్మాన్ ఖాన్ తో కీసికా భాయ్.. కిసి కి జాన్ సినిమాలో నటించారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో వెంకటేష్ కూడా నటిస్తున్నారు.