AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salaar Release Trailer: దుమ్మురేపిన ప్రభాస్.. సలార్ మూవీ నుంచి నయా ట్రైలర్

ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే ఇప్పటికె విడుదలైన పోస్టర్స్, టీజర్స్ తో పాటు మొన్నీమధ్య విడుదలైన ట్రైలర్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేసింది. తాజాగా రిలీజ్ డేట్ దెగ్గర పడుతుండటంతో మరో ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.

Salaar Release Trailer: దుమ్మురేపిన ప్రభాస్.. సలార్ మూవీ నుంచి నయా ట్రైలర్
Salaar
Rajeev Rayala
|

Updated on: Dec 18, 2023 | 4:04 PM

Share

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సలార్. ఈ సినిమా కోసం అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా.. అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్స్ తో పాటు మొన్నీమధ్య విడుదలైన ట్రైలర్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేసింది. డిసెంబర్ 22 న సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా ఇప్పటికే యుఎస్ బుకింగ్స్ లో రికార్డ్ క్రియేట్ చేసింది.

ప్రభాస్ నటిస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో ఈ సినిమా ఖచ్చితంగా భారీ విజయాన్ని అందుకుంటుందని అభిమానులు అంచనా వస్తున్నారు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తాజాగా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మరో ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ సినిమా పై అంచనాలను తారా స్థాయికి చేర్చాయి.

సలార్ సినిమాలో ప్రభాస్ మెకానిక్ గ కనిపించనున్నాడు. తన స్నేహితుడి కోసం ఒక సామ్రాజ్యంతో యుద్ధం చేసే వీరుడిగా ఈ సినిమాలో కనిపించనున్నాడు ప్రభాస్. సలార్ సినిమాలో ప్రభాస్ కు జోడీగా శ్రుతిహాసన్ నటిస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే సలార్ సినిమా నయా ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.

సలార్ మూవీ న్యూ ట్రైలర్

సలార్ మూవీ మేకర్స్ ట్విట్టర్ పోస్ట్

మరిన్ని తాజా సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.