Salaar: ‘నేను మంచి భర్తను కాను.. నా పిల్లలను కూడా అప్పుడే చూడడానికి వెళతా’: సలార్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌

|

Dec 24, 2023 | 3:54 PM

పాన్‌ ఇండియా సినిమాలతో దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంటోన్న ప్రశాంత్‌ నీల్ తన పర్సనల్ లైఫ్ లో చాలా విషయాలు మిస్ అవుతున్నారట. సినిమా ప్రేమలో పడి కనీసం పిల్లలతో గడిపే సమయం కూడా దొరకడం లేదంట డైరెక్టర్‌కి. ఇటీవల సలార్‌ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న ప్రశాంతే ఈ విషయాలను బయటపెట్టాడు. 'సలార్‌' సినిమా స్నేహానికి సంబంధించిన అంశం కాబట్టి ఓ రిపోర్టర్‌ 'ప్రశాంత్ నీల్ స్నేహాన్ని ఎలా నిర్వహిస్తాడు? అని డైరెక్టర్‌ను అడిగాడు

Salaar: నేను మంచి భర్తను కాను.. నా పిల్లలను కూడా అప్పుడే చూడడానికి వెళతా: సలార్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌
Prashanth Neel Family
Follow us on

సలార్‌ సినిమాతో మరో బ్లాక్‌ బస్టర్‌ను ఖాతాలో వేసుకున్నాడు డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్. ప్రభాస్‌ హీరోగా నటించిన ఈ పవర్‌ ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ శుక్రవారం (డిసెంబర్‌ 22) ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ‘పఠాన్’, ‘ జవాన్ ‘, ‘యానిమల్’ వంటి సూపర్ హిట్ సినిమాల రికార్డులను అధిగమించి తొలిరోజే రూ.175 కోట్లు రాబట్టింది. దీంతో భారతీయ సినిమా ఇండస్ట్రీలో ప్రశాంత్‌ నీల్‌ పేరు మరోసారి మార్మోగిపోతోంది. అయితే పాన్‌ ఇండియా సినిమాలతో దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంటోన్న ప్రశాంత్‌ నీల్ తన పర్సనల్ లైఫ్ లో చాలా విషయాలు మిస్ అవుతున్నారట. సినిమా ప్రేమలో పడి కనీసం పిల్లలతో గడిపే సమయం కూడా దొరకడం లేదంట డైరెక్టర్‌కి. ఇటీవల సలార్‌ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న ప్రశాంతే ఈ విషయాలను బయటపెట్టాడు. ‘సలార్‌’ సినిమా స్నేహానికి సంబంధించిన అంశం కాబట్టి ఓ రిపోర్టర్‌ ‘ప్రశాంత్ నీల్ స్నేహాన్ని ఎలా నిర్వహిస్తాడు? అని డైరెక్టర్‌ను అడిగాడు’ దీనికి అతను సూటిగా సమాధానం ఇచ్చాడు ‘నేను మంచి భర్తను కాను. మంచి కొడుకును కాను. మంచి తండ్రిగా కూడా ఉండలేకపోయాను. అలాగే మంచి స్నేహితుడిని కూడా కాదు. సినిమా కోసం నేను అన్నీ త్యాగం చేశాను. అయితే స్నేహ మాధుర్యం మాత్రం నాకు బాగా తెలుసు. విజయ్ కిర్గందూర్ (హోంబలే ప్రొడక్షన్స్‌ అధినేతలు) చూస్తుంటే గర్వంగా అనిపిస్తుంది’ అని ప్రశాంత్‌ నీల్‌ చెప్పుకొచ్చారు.

‘నేను కుటుంబ సభ్యులతో కూడా ఎక్కువ సమయం గడపలేదు. నేను నా పిల్లలను కూడా మూడు నెలలకు ఒకసారి చూస్తాను. ది కూడా వాళ్లు ఏడ్చినప్పుడు మాత్రమే. కానీ వెంటనే వెళ్లి వచ్చేస్తాను. నేను ఈ వాస్తవాన్ని అంగీకరిస్తున్నాన. నేను చేసే సినిమా బాగా తీయాలన్నదే నా ఉద్దేశం. ఒక సినిమా పూర్తయ్యాక విశ్రాంతి తీసుకోవడం నా ఇష్టం’ అని ప్రశాంత్ నీల్ తెలిపారు. ప్రశాంత్ నీల్ పాపులారిటీ రావడానికి ఆయన భార్య లిఖితా రెడ్డి కూడా కారణం. ప్రశాంత్ సినిమా పనుల్లో బిజీగా ఉండగా, లిఖిత పూర్తిగా పిల్లల సంరక్షణ బాధ్యత తీసుకుంటుంది. సలార్‌ సినిమాతో హ్యాట్రిక్‌ హిట్లను ఖాతాలో వేసుకున్నారు ప్రశాంత్‌ నీల్. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్, జగపతిబాబు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

ఇవి కూడా చదవండి

కుటుంబ సభ్యులతో ప్రశాంత్ నీల్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.