Naga Chaitanya: అక్కినేని అందగాడితో జోడీ కట్టనున్న ఆ స్టార్‌ హీరోయిన్లు.. ‘NC 23’ పై పెరుగుతున్న అంచనాలు..

ఇటీవలే కస్టడీ సినిమాతో మరోసారి యాక్షన్‌ పంథాలోకి వెళ్లిపోయాడు చై. కంటెంట్‌ బాగున్నా సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో తనకు యాక్షన్ సినిమాలు సూట్‌ కావని మరోసారి నిరూపితమైంది. కాగా ప్రస్తుతం కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు చైతూ. చందూ మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. దీనికి తాత్కాలికంగా 'NC23' అని పేరు పెట్టారు. ఇప్పుడు ఈ సినిమా గురించిన ఓ కొత్త అప్‌డేట్‌ వచ్చింది.

Naga Chaitanya: అక్కినేని అందగాడితో జోడీ కట్టనున్న ఆ స్టార్‌ హీరోయిన్లు.. NC 23 పై పెరుగుతున్న అంచనాలు..
Naga Chaitanya, Chandoo Mondeti

Updated on: Aug 20, 2023 | 10:04 AM

టాలీవుడ్‌లో మంచి డిమాండ్ ఉన్న హీరో అక్కినేని నాగ చైతన్య . ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు. ముఖ్యంగా చైతూ నటించిన ప్రేమకథా చిత్రాలు యూత్‌ను తెగ ఆకట్టుకున్నా్యి. ఇటీవలే కస్టడీ సినిమాతో మరోసారి యాక్షన్‌ పంథాలోకి వెళ్లిపోయాడు చై. కంటెంట్‌ బాగున్నా సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో తనకు యాక్షన్ సినిమాలు సూట్‌ కావని మరోసారి నిరూపితమైంది. కాగా ప్రస్తుతం కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు చైతూ. చందూ మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. దీనికి తాత్కాలికంగా ‘NC23’ అని పేరు పెట్టారు. ఇప్పుడు ఈ సినిమా గురించిన ఓ కొత్త అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమా హీరోయిన్ ఎంపికలో దర్శకుడు నిమగ్నమయ్యాడు. కీర్తి సురేష్ లేదా సాయి పల్లవి ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. సాయి పల్లవి అభినయం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలో నాగచైతన్యకు జోడీగా సాయి పల్లవినే ఎంపిక చేయాలన్నది చందు నిర్ణయం. అయితే టీమ్‌లోని మరికొందరు మాత్రం కీర్తి సురేష్‌ని ఎంపిక చేయాలని సూచించినట్లు సమాచారం. అయితే ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేసుకున్నా పాత్రకు తగిన న్యాయం చేస్తుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

గతంలోసాయి పల్లవి, నాగ చైతన్య గతంలో ‘లవ్‌స్టోరీ’ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా పెద్దగా ఆడిపోయినా చైతు, సాయిపల్లవిల జోడీకి మంచి క్రేజ్‌ వచ్చింది. ఇక ‘మహానటి’ సినిమాలో నాగ చైతన్య, కీర్తి సురేష్‌లు కలిసి కొన్ని సన్నివేశాల్లో జంటగా కనిపించారు. మరోవైపు నాగ చైతన్య వరుసగా పరాజయాలను ఎదుర్కొంటున్నాడు. ఇటీవల అతను నటించిన సినిమాలు పెద్దగా క్లిక్‌ కావడం లేదు. అందుకే చైతూకు ఇప్పుడు భారీ విజయం అవసరం. చందూ మోండేటి ‘NC23’తో భారీ హిట్‌ కొట్టాలని కసిగా ఉన్నాడు చైతూ. గతంలో ఇదే దర్శకుడి కాంబినేషన్‌లో ప్రేమమ్‌, సవ్యసాచి సినిమాల్లో నటించాడీ అక్కినేని యంగ్‌ హీరో. దీనికి తోడు కార్తికేయ 2 సినిమాతో పాన్‌ ఇండియా స్థాయిలో పాపులర్‌ అయిపోయాడు చందూ మొండేటి. దీంతో వీరిద్దరి హ్యాట్రిక్‌ కాంబినేషన్లో తెరకెక్కే ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. NC23 సినిమా త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో ఎవరు నటిస్తారు? టెక్నికల్ టీం తదితర విషయాలపై త్వరలోనే మరింత క్లారిటీ రానుంది.

ఇవి కూడా చదవండి

సాయి పల్లవి..

కీర్తి సురేష్ 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.