AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Pallavi: పాన్ ఇండియా మూవీలో ఫిదా బ్యూటీ.. భారీ సినిమాకు సైన్ చేసిన సాయి పల్లవి..

ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫుల్ ఫిదా అయ్యేలా చేసింది ముద్దుగుమ్మ సాయి పల్లవి. ఆ సినిమాతర్వాత ఈ అమ్మడు హీరోలకు..

Sai Pallavi: పాన్ ఇండియా మూవీలో ఫిదా బ్యూటీ.. భారీ సినిమాకు సైన్ చేసిన సాయి పల్లవి..
Sai Pallavi
Rajeev Rayala
|

Updated on: Aug 01, 2021 | 2:00 PM

Share

Sai Pallavi: ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫుల్ ఫిదా అయ్యేలా చేసింది ముద్దుగుమ్మ సాయి పల్లవి. ఆ సినిమా తర్వాత ఈ అమ్మడు హీరోలకు ఫస్ట్ ఛాయిస్‌‌‌గా మారిపోయింది. దాంతో ఈ అమ్మడికి అవకాశాలు క్యూ కట్టాయి. అయితే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఆచి తూచి అడుగులు వేస్తుంది ఈ చిన్నది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లవ్ స్టోరీలో చేస్తుంది. ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా నటిస్తున్నాడు. త్వరలోనే ఈ ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే రానా నటిస్తున్న విరాట పర్వం సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది సాయి పల్లవి. నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమాలో కూడా ఈ అమ్మడు హీరోయిన్‌‌‌గా చేస్తుంది. వీటితోపాటు తమిళ్‌‌‌‌లోనూ ఈ ముద్దుగుమ్మ పలు సినిమాల్లో యాక్ట్ చేస్తుంది. ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సాయి పల్లవి ఇప్పుడు ఓ పాన్ ఇండియా సినిమాకు సైన్ చేసిందని టాక్.

తమిళ దిగ్గజ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ బ్యానర్‌‌‌లో ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాను చేసేందుకు సిద్ధం అవుతుంది. గౌతమ్ రామ చంద్రన్ దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ సినిమాలో సాయిపల్లవిని ఎంపిక చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్‌‌‌‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయని.. అతి త్వరలోనే సినిమాను పట్టాలెక్కించబోతున్నట్లుగా చెబుతున్నారు. సినిమాను వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Annaatthe : ఆ వార్తల్లో నిజంలేదు.. రజినీకాంత్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్..

Venkatesh: సంక్రాంతికి వచ్చి సందడి చేస్తా.. ఎఫ్3 రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన వెంకటేష్..

Pushpa : విలనిజంతో మరోసారి భయపెట్టడానికి సిద్ధమవుతోన్న సునీల్.. పుష్పలో ఫహాద్‌‌‌ను మించి

Priyanka Jawalkar : బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఆకట్టుకొంటున్న తెలుగమ్మాయి..

Follow Us
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా