Sai Pallavi: ఉగ్రదాడిపై సాయి పల్లవి ట్వీట్.. పాత వీడియోతో ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..

న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి ప్రస్తుతం రామాయణ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ నితీష్ తివారీ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో రణభీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా..ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై సాయి పల్లవి స్పందిస్తూ ట్వీట్ చేసింది. దీంతో ఆమె పాత వీడియోనూ షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్.

Sai Pallavi: ఉగ్రదాడిపై సాయి పల్లవి ట్వీట్.. పాత వీడియోతో ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..
Sai Pallavi

Updated on: Apr 24, 2025 | 9:42 AM

జమ్మూ కశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని సినీతారలు ఖండిస్తున్నారు. ఈ ఘటనలో 27 మంది చనిపోవడం ఎంతో బాధాకరమంటూ ట్వీట్స్ చేశారు. మినీ స్విట్జర్లాండ్ గా పేరొందిన బైసరన్ లోయలో జరిగిన రక్తపాతంపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వలలు వ్యక్తమవుతున్నాయి. అటు ప్రపంచ దేశాలు సైతం భారత్ కు అండగా నిలబడుతున్నాయి. ఇప్పటికే ఈ ఘటనపై టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన స్టార్స్ రియాక్ట్ అయ్యారు. తాజాగా న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి సైతం ఉగ్రదాడి పై స్పందిస్తూ నెట్టింట సుధీర్ఘ ట్వీట్ చేసింది. దీంతో గతంలో ఆమెకు సంబంధించిన ఓ ఇంటర్వ్యూ వీడియోనూ నెట్టింట షేర్ చేస్తూ మండిపడుతున్నారు నెటిజన్స్. ఇంతకీ అసలే జరిగిందంటే..

ఉగ్రదాడిపై సాయి పల్లవి స్పందిస్తూ.. “పహల్గాం దాడిలో జరిగిన నష్టం, కలిగిన బాధ, ఏర్పడిన భయం నాకు వ్యక్తిగతంగా జరిగినట్లు అనిపిస్తోంది. చరిత్రలో జరిగిన భయంకరమైన నేరాల గురించి తెలుసుకుని.. ఇప్పటికీ అలాంటి అమానవీయ చర్యలకు సాక్షిగా ఉండడం వల్ల.. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఏమి మారలేదని అర్థమవుతుంది. ఆ జంతువుల సమూహం మిగిలి ఉన్న ఆ కొద్దిపాటి ఆశను తుడిచిపెట్టేసింది. కుటుంబంతో జ్ఞాపకాలను సృష్టించాలనుకునే మనస్తత్వం నుండి, మీ ఎమోషన్స్, మీ కుటుంబం మీ ముందే కోల్పోవడం చూడడం వరకు.. ఇది నన్ను మన మూలాన్ని ప్రశ్నించేలా చేస్తుంది. నిస్సహాయంగా, శక్తిహీనులుగా, కోల్పోయిన అమాయక జీవితాలు, వేదనకు గురైన కుటుంబాల కోసం నా హృదయపూర్వక సంతాపాన్ని , ప్రార్థనలను అందిస్తున్నాను ” అంటూ ట్వీట్ చేసింది.

అయితే ఈ ట్వీట్ పై నెటిజన్స్ భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. గతంలో సాయి పల్లవి మన ఆర్మీ మీద చేసిన కామెంట్లకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తున్నారు. గతంలో ఓ సినిమా ప్రమోషన్లలో భాగంగా సాయి పల్లవి మాట్లాడుతూ.. కశ్మీర్ పండితుల మీద జరిగిన దాడి.. గోవుల పేరిటి చేసే వాటిని రెండింటిని ఒకే విధంగా పోల్చడంపై సాయి పల్లవి పై మరోసారి విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :  

Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..

Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..

OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..