Sai Pallavi: పెళ్లి రూమర్స్ పై స్పందించిన సాయి పల్లవి.. నిజంగానే నీచమైన పనంటూ..

సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న ఆ ఫోటోస్ పై ఇప్పటికే విరాట పర్వం డైరెక్టర్ వేణు ఊడుగుల క్లారిటీ ఇచ్చారు. సాయి పల్లవి పక్కన ఉన్న ఆ వ్యక్తి డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి అని అతను ఆమె నెక్ట్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అంటూ వివరణ ఇచ్చారు. అయినప్పటికీ సాయి పల్లవి పెళ్లి రూమర్స్ మాత్రం ఆగడం లేదు. తాజాగా ఈ రూమర్స్ పై సాయి పల్లవి స్పందించింది. తన మ్యారెజ్ గురించి వస్తోన్న పూకార్లు ఏమాత్రం నిజం కావని ఖండించింది.

Sai Pallavi: పెళ్లి రూమర్స్ పై స్పందించిన సాయి పల్లవి.. నిజంగానే నీచమైన పనంటూ..
Sai Pallavi

Updated on: Sep 22, 2023 | 5:14 PM

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి పెళ్లి గురించి వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ దర్శకుడితో ఆమె పెళ్లి జరిగిపోయిందంటూ ఓ ఫోటోను వైరలవుతుంది. దీంతో ఆ డైరెక్టర్ ఎవరు ?. సాయి పల్లవి మ్యారెజ్ చేసుకున్న వ్యక్తి పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకునేందుకు నెట్టింట సెర్చింగ్ స్టార్ చేశారు. అయితే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న ఆ ఫోటోస్ పై ఇప్పటికే విరాట పర్వం డైరెక్టర్ వేణు ఊడుగుల క్లారిటీ ఇచ్చారు. సాయి పల్లవి పక్కన ఉన్న ఆ వ్యక్తి డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి అని అతను ఆమె నెక్ట్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అంటూ వివరణ ఇచ్చారు. అయినప్పటికీ సాయి పల్లవి పెళ్లి రూమర్స్ మాత్రం ఆగడం లేదు. తాజాగా ఈ రూమర్స్ పై సాయి పల్లవి స్పందించింది. తన మ్యారెజ్ గురించి వస్తోన్న పూకార్లు ఏమాత్రం నిజం కావని  ఖండించింది.

“నిజంగా చెప్పాలంటే నేను రూమర్స్ పట్టించుకోను. కానీ అది కుటుంబ సభ్యులైన, స్నేహితులతో కలిసినప్పుడు వాటి గురించి మాట్లాడాల్సి ఉంటుంది. నేను నటిస్తోన్న సినిమా పూజా కార్యక్రమం నుంచి ఒక ఫోటోను ఉద్ధేశపూర్వకంగా కత్తిరించి.. దానిని డబ్బు కోసం, నీచమైన ఉద్దేశాలతో ప్రచారం చేస్తున్నారు. నా సినిమాలకు సంబంధించిన మంచి అప్డేట్స్ పంచుకునేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఇలాంటి పనికిమాలిన విషయాలపై స్పందించడం నిజంగా బాధంగా ఉంది. ఒక వ్యక్తికి ఇలాంటి ఇబ్బందిని కలిగించడం నిజంగా నీచమైన పనే” అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించింది సాయి పల్లవి.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సాయి పల్లవి కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ సరసన నటిస్తోంది. ఈ చిత్రానికి రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అదే సమయంలో డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి, శివ కార్తికేయన్ తోపాటు సాయి పల్లవి కూడా గులాబీ దండలు వేసుకుని క్లాప్ పట్టుకుని నిల్చోన్న ఫోటోస్ అవి. ఆ పిక్ క్రాప్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ఇక సాయి పల్లవి సినిమాల విషయానికి వస్తే.. చివరిసారిగా గార్గి చిత్రంలో నటించింది. స్టార్ హీరో సూర్య నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ అందుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నాగచైతన్య జోడిగా కనిపించనుంది. NC23 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.