Virata Parvam: వెన్నెల ప్రేమకథ చుట్టూ తిరిగే విరాట పర్వం.. సాయి పల్లవి సినిమా ట్విట్టర్‌ రివ్యూ ఎలా ఉందంటే..

Virata Parvam Twitter Review: న్యాచురల్‌ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi), దగ్గుబాటి రానా (Rana Daggubati ) హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం విరాట పర్వం (Sai Pallavi). వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన

Virata Parvam: వెన్నెల ప్రేమకథ చుట్టూ తిరిగే విరాట పర్వం.. సాయి పల్లవి సినిమా ట్విట్టర్‌ రివ్యూ ఎలా ఉందంటే..
Virata Parvam

Updated on: Jun 17, 2022 | 7:53 AM

Virata Parvam Twitter Review: న్యాచురల్‌ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi), దగ్గుబాటి రానా (Rana Daggubati ) హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం విరాట పర్వం (Sai Pallavi). వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియమణి, నందితాదాస్‌, నవీన్‌ చంద్ర, ఈశ్వరీ రావ్‌, నివేదా పేతురాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నక్సలిజానాకి ప్రేమకథను జోడించి ఈ సినిమాను రూపొందించారు. టీజర్లు, ట్రైలర్లతోనే అంచనాలను పెంచేసిన ఈ సినిమా శుక్రవారం (జూన్‌ 17) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే గత రాత్రి ఈ సినిమా ప్రీమియర్స్ వేశారు. అలాగే ఓవర్‌సీస్ లో సినిమాను ప్రదర్శించారు. మరి ఈ విరాటపర్వం చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా ఎలా రియాక్ట్ అవుతున్నారో ఓ సారి తెలుసుకుందాం రండి.

ప్రేమకు, విప్లవానికి మధ్య..

ఇవి కూడా చదవండి

కాగా ఈ సినిమా ఫస్టాఫ్ చాలా బాగుందని ఆడియన్స్‌ అంటున్నారు. వెన్నెల లవ్ స్టోరీ చుట్టే సినిమా నడిచిందని, ఇంటర్వెల్ సీన్స్‌ చాలా అద్భుతంగా ఉందంటూ టాక్‌ వినిపిస్తోంది. ఇక ఈ చిత్రానికి సాయి పల్లవి యాక్టింగ్‌ మేజర్ అసెట్ అంటున్నారు. రానా యాక్టింగ్‌ కూడా బాగుందని, డైరెక్టర్ వేణు ఊడుగుల స్టోరీ నేరేట్ చేసిన తీరు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిందని ప్రేక్షకుల నుంచి ట్వీట్స్ వస్తున్నాయి. సినిమాలోని పాటలు, నేపథ్య సంగీతం సూపర్బ్‌గా ఉన్నాయని, టెక్నీకల్లీగా ఈ సినిమా కూడా అద్భుతంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక సెకండాఫ్‌లో ప్రేమకు, విప్లవానికి మధ్య సంఘర్షణను చాలా చక్కగా చూపించారంటూ ప్రేక్షకులు చెబుతున్నారు. ఇక క్లైమాక్స్‌ అందరి హృదయాలకు కనెక్ట్ అయ్యేలా ఉందనే రివ్యూస్ కనిపిస్తున్నాయి. సో.. మొత్తంగా చెప్పాలంటే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిందనే తెలుస్తోంది. మరి థియేటర్స్‌లో ఈ సినిమా ఎలా సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..