ఆర్ నారాయణ మూర్తి.. తెలుగు ప్రేక్షకులు ఎప్పటి గుర్తు పెట్టుకునే పేరు ఆయనది. ఆయన సినిమాలు ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి. ఆయన సినిమాలో ప్రేక్షకులను ప్రశ్నిస్తాయి. తెలుగు సినిమాల్లో ఆయనకంటూ ఓ ప్రత్యేక శైలిని ఏర్పాటు చేసుకున్నారు ఆర్ నారాయణ మూర్తి. ఎన్నో వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు. సమాజాన్ని ప్రశ్నించే కథలతో సినిమాలు తెరకెక్కించడం ఆర్ నారాయణ మూర్తి ప్రత్యేకత . లగ్జరీ లైఫ్ కు నో చెప్పి సింపుల్ గా బ్రతికేయడం ఒక్క నారాయణ మూర్తికే సాధ్యం.. ఇప్పటికీ ఎక్కడికి వెళ్లాలన్న ఆటోల్లో, ఆర్టీసీ బస్సులో అది కుదరకపోతే కాలి నడకన వెళ్తుంటారు నారాయణ మూర్తి. ఆయన సినిమాల గురించి ఎంత చెప్పిన తక్కువే.. ఎర్ర సైన్యం, ఒరేయ్ రిక్షా, చీమలదండు ఇలా ఎన్నో మంచి సినిమాలు చేశారు. ఇదిలా ఉంటే ఆర్ నారాయణ మూర్తికి ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా.. అది కూడా ఈ జనరేషన్ హీరోయిన్స్ లో..
ఆర్ నారాయణ మూర్తికి ఈ జనరేషన్స్ లో నచ్చిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది సాయి పల్లవి అనే చెప్పాలి. మాములుగా ఆర్ నారాయణ మూర్తి ఏ హీరోయిన్ ను అంతగా పొగిడారు. నటన బాగుంటే .. బాగా చేసింది అని అంటారు అంతే.. కానీ సాయి పల్లవి నటనకు ఆయన ఫిదా అయ్యారు.