AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shruti Haasan: చిరంజీవి, బాలయ్య గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన శ్రుతిహాసన్..

ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'వీరసింహారెడ్డి' జనవరి 12 విడుదలౌతుండగా, జనవరి 13న 'వాల్తేరు వీరయ్య' ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Shruti Haasan: చిరంజీవి, బాలయ్య గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన శ్రుతిహాసన్..
Shruti Haasan
Rajeev Rayala
|

Updated on: Jan 11, 2023 | 8:30 AM

Share

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రెండు బడా మూవీస్ బాలకృష్ణ వీరసింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య. ఈ రెండు  సినిమాలు సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానున్నాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘వీరసింహారెడ్డి’ జనవరి 12 విడుదలౌతుండగా, జనవరి 13న ‘వాల్తేరు వీరయ్య’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే విడుదలైన ‘వీరసింహారెడ్డి’ చిత్రంలోని జై బాలయ్య, సుగుణ సుందరి, మా బావ మనోభావాలు, మాస్ మొగుడు.. ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి, వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్, పూనకాలు లోడింగ్ పాటలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’.. ఈ రెండు చిత్రాలలో స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ కథానాయిగా నటించింది. తాజాగా శ్రుతి హాసన్. ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాల విశేషాలని పంచుకున్నారు.

శ్రుతి హాసన్ మాట్లాడుతూ.. నిజానికి ఇది నేను ఊహించలేదు. నా కెరీర్ లో ఇలా జరగడం రెండోసారి. ఏడేళ్ళ క్రితం నేను నటించిన రెండు సినిమాలు ఒకేసారి విడుదల అయ్యాయి. చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి ఒక సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు, బాలకృష్ణ గారు, చిరంజీవి గారు లాంటి ఇద్దరు లెజెండరీ హీరోల సినిమాలు విడుదల అవుతున్నాయి. చాలా ఆనందంగా వుంది. ఈ విషయంలో చాలా అదృష్టంగా ఫీలౌతున్నా అని అంది.

అలాగే రెండు భిన్నమైన కథలు. భిన్నమైన పాత్రలు. వీరసింహా రెడ్డిలో నా పాత్ర ఫన్ ఫుల్ గా వుంటుంది. వాల్తేరు వీరయ్యలో కంప్లీట్ డిఫరెంట్. రెండు పాత్రలు సవాల్ తో కూడుకున్నవి. వాల్తేరు వీరయ్యలో నా పాత్రని దర్శకుడు బాబీ చాలా చక్కగా డిజైన్ చేశారు. ఈ విషయంలో ఆయనకి థాంక్స్ చెప్పాలి. వీరసింహారెడ్డి విషయానికి వస్తే నా పాత్రలో కామెడీ వుంటుంది. కామెడీ చేయడం చాలా కష్టం. అందుకే ఏ పాత్రకు ఆ పాత్రే ప్రత్యేకం. చిరంజీవి, బాలకృష్ణ గారితో డ్యాన్స్ చేయడం నైస్ ఎక్స్ పీరియన్స్. వారిద్దరూ చాలా మంచి డ్యాన్సర్లు. సుందరి పాట చాలా వైడ్ గా రీచ్ అయ్యింది. శ్రీదేవి చిరంజీవి పాట కూడా అద్భుతంగా వచ్చింది అని చెప్పుకొచ్చింది శ్రుతి.

ఇవి కూడా చదవండి

అలాగే బాలకృష్ణ గారు, చిరంజీవి గారితో పని చేయడం గొప్ప అనుభవం. బాలకృష్ణ గారు చాలా పాజిటివ్ ఎనర్జీ తో వుంటారు. దేవుడ్ని బలంగా నమ్ముతారు. చిరంజీవి గారు చాలా ప్రశాంతత, సున్నితంగా వుంటారు. వారిద్దరి నుండి చాలా మంచి విషయాలు నేర్చుకున్నాను అని తెలిపింది శ్రుతిహాసన్.

Follow Us