Sai Dharam Tej: క్లింకార చాలా అదృష్టవంతురాలు.. అచ్చం ఆయన పోలికలే వచ్చాయి: సాయి ధరమ్ తేజ్‌

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, ఉపాసన దంపతులు కొద్ది రోజుల క్రితమే అమ్మనాన్నలుగా ప్రమోషన్‌ పొందారు. ఉపాసన క్లింకార కొణిదెల అనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే చాలామంది సెలబ్రిటీల్లాగానే రామ్‌చరణ్‌ దంపతులు కూడా తమ గారాల పట్టి ముఖాన్ని బయటకు చూపించడం లేదు

Sai Dharam Tej: క్లింకార చాలా అదృష్టవంతురాలు.. అచ్చం ఆయన పోలికలే వచ్చాయి: సాయి ధరమ్ తేజ్‌
Sai Dharam Tej

Updated on: Jul 25, 2023 | 5:24 PM

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, ఉపాసన దంపతులు కొద్ది రోజుల క్రితమే అమ్మనాన్నలుగా ప్రమోషన్‌ పొందారు. ఉపాసన క్లింకార కొణిదెల అనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే చాలామంది సెలబ్రిటీల్లాగానే రామ్‌చరణ్‌ దంపతులు కూడా తమ గారాల పట్టి ముఖాన్ని బయటకు చూపించడం లేదు. బారసాల ఫొటోలతో పాటు కొన్ని ఇమేజెస్‌, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసినా తమ కూతురు ఫేస్‌ కనిపించకుండా తగు జాగ్రత్తపడారు చెర్రీ దంపతులు. దీంతో క్లింకార ఎలా ఉంది? తాత చిరంజీవి, తండ్రి రామ్‌చరణ్‌ పోలికలు వచ్చాయా? అంటూ అభిమానులు రామ్‌చరణ్‌-ఉపాసన దంపతులను అడుగుతున్నారు ఫ్యాన్స్‌. దయచేసి క్లింకార ఫొటోలు షేర్‌ చేయండంటూ రిక్వెస్ట్‌ చేస్తున్నారు. అయితే తాజాగా మెగా ప్రిన్సెస్‌ గురించి సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు ఎవరి పోలికలు వచ్చాయో కూడా చెప్పేశాడు. ‘క్లింకారకు తండ్రి పోలికలే వచ్చాయి. అచ్చం రామ్‌చరణ్‌ లాగే ఉంటుంది. కళ్లైతై చాలా బాగున్నతాయి. నాకు తెగ నచ్చేశాయి. అమ్మాయి తండ్రి పోలికలతో పుడితే అదృష్టమంటారు. క్లింకార విషయంలోనూ అదే జరిగింది’ అని తేజ్‌ చెప్పుకొచ్చాడు.

 

ఇవి కూడా చదవండి

కాగా సాయి ధరమ్‌ తేజ్‌ నటిస్తోన్న ‘బ్రో’ సినిమా జులై 28న గ్రాండ్‌గా విడుదల కానుంది. పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ మరో హీరోగా నటిస్తున్నాడీ సినిమాలో. మామ అల్లుళ్లు కలిసి మొదటిసారిగా నటించడంతో బ్రో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. సముద్ర ఖని దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కేతిక శర్మ, ప్రియాంక వారియర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈరోజు హైదరాబాద్‌ శిల్పకళా వేదికలో బ్రో ప్రి రిలీజ్‌ ఈవెంట్ జరగనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.