Sai Dharam Tej: అర్జెంట్‌గా రూ.10 లక్షలు కావాలని అడిగిన నెటిజన్‌.. సాయి ధరమ్‌ తేజ్‌ ఆన్సర్‌ ఏమిటంటే?

|

Nov 15, 2023 | 9:09 AM

సాయి ధరమ్ తేజ్‌ మొదటి సినిమా పిల్లా నువ్వు లేని జీవితం విడుదలై మంగళవారానికి (నవంబర్‌ 14)కు సరిగ్గా 9 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో తాను టాలీవుడ్‌కు పరిచయమై 9 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సుప్రీమ్‌ హీరో సోషల్‌ మీడియాలో అభిమానులతో చిట్‌చాట్‌ నిర్వహించారు. #AskSDT పేరుతో నెటిన్లతో ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఎంతో ఓపికగా సమాధానాలిచ్చారు.

Sai Dharam Tej: అర్జెంట్‌గా రూ.10 లక్షలు కావాలని అడిగిన నెటిజన్‌.. సాయి ధరమ్‌ తేజ్‌ ఆన్సర్‌ ఏమిటంటే?
Sai Dharam Tej
Follow us on

పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు సాయి ధరమ్ తేజ. మొదటి మూవీలోనే డ్యాన్స్‌, యాక్టింగ్‌తో మెగా ఫ్యాన్స్‌ను మెప్పించాడు. సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌, సుప్రీమ్‌, చిత్రల హరి, ప్రతి రోజు పండగే, సోలో బ్రతుకే సో బెటర్‌, రిపబ్లిక్‌, విరూపాక్ష, బ్రో సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా సాయి ధరమ్ తేజ్‌ మొదటి సినిమా పిల్లా నువ్వు లేని జీవితం విడుదలై మంగళవారానికి (నవంబర్‌ 14)కు సరిగ్గా 9 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో తాను టాలీవుడ్‌కు పరిచయమై 9 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సుప్రీమ్‌ హీరో సోషల్‌ మీడియాలో అభిమానులతో చిట్‌చాట్‌ నిర్వహించారు. #AskSDT పేరుతో నెటిన్లతో ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఎంతో ఓపికగా సమాధానాలిచ్చారు. ఈ క్రమంలోనే తనకు అర్జెంట్‌గా ఓ 10 లక్షల రూపాయలు కావాలంటూ ఓ నెటిజన్‌ తేజ్‌ ను అడిగాడు. దీనికి బ్రహ్మానందం నవ్వుతూ కనిపించే జిఫ్‌ ఇమేజ్‌ని పోస్ట్‌ చేశాడు సుప్రీం హీరో. ఇక మీ పెళ్లి ఎప్పుడనే ప్రశ్నకు ‘నీ వివాహం అయిన వెంటనే చేసుకుంటా బ్రో’ అని మరో నెటిజన్‌కు రిప్లై ఇచ్చాడు.

ఇక మావయ్య పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ గురించి ఒక్క మాటలో చెప్పమని మరొకరడు అడగగా ‘గురువు’ అని సమాధానం చెప్పాడు తేజ్‌. ‘చిన్న మామయ్య (పవన్‌ కల్యాణ్‌)తో కలిసి బ్రోలో నటించారు. పెద్ద మామయ్య (చిరంజీవి)తో ఎప్పుడు?’ అన్న ప్రశ్నకు ‘ ఆ అవకాశం కోసం నేనూ ఎదురుచూస్తున్నా’ అని ఆన్సర్‌ ఇచ్చాడు. భవిష్యత్తులో రామ్‌చరణ్‌తో కలిసి నటించే అవకాశం ఉందా? అని మరొకరు అడగ్గా.. మంచి కథ కుదిరితే తప్పకుండా కలిసి నటిస్తామన్నాడు సాయి ధరమ్‌ తేజ్‌. ఇక తన తర్వాతి సినిమా ప్రాజెక్టులపై స్పందిస్తూ ప్రస్తుతం గాంజా శంకర్‌ మూవీ చేస్తానన్నాడీ సుప్రీం హీరో. సంపత్‌ నంది ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని అప్‌డేట్స్‌ రానున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.