RRR: క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డ్స్‏లో ‘ఆర్ఆర్ఆర్’ దూకుడు.. ఏకంగా రెండు కేటగిరిల్లో..

లాస్ ఏంజిల్స్ లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ లో రెండు కేటగిరిల్లో నామినేట్ అయ్యింది. అంతేకాదు.. హాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యుత్తమ్మ చిత్రాలతో ట్రిపుల్ ఆర్ పోటీ పడుతుంది.

RRR: క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డ్స్‏లో ఆర్ఆర్ఆర్ దూకుడు.. ఏకంగా రెండు కేటగిరిల్లో..
Rrr Movie

Updated on: Feb 23, 2023 | 11:08 AM

దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ ఓవర్సీస్‏లో విజయయాత్రను కొనసాగిస్తోంది. ఇప్పటికే విశ్వ వేదికగా ఎన్నో అవార్డ్స్ అందుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డులలో రెండు నామినేషన్స్ పొందింది. ఇప్పటికే ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ సొంతం చేసుకున్న ఈ సినిమా.. మరోవైపు ఆస్కార్ 2023 కోసం పోటీ పడుతుంది. ఇక ఇప్పుడు లాస్ ఏంజిల్స్ లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ లో రెండు కేటగిరిల్లో నామినేట్ అయ్యింది. అంతేకాదు.. హాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యుత్తమ్మ చిత్రాలతో ట్రిపుల్ ఆర్ పోటీ పడుతుంది.

టాప్ గన్.. మావెరిక్, బుల్లెట్ ట్రైన్, ది అన్ బేరబుల్ వెయిట్ ఆఫ్ మాసివ్ టాలెంట్, ది ఉమెన్ కింగ్ చిత్రాలతోపాటు.. ఉత్తమ యాక్షన్ సినిమా విభాగంలో ఆర్ఆర్ఆర్ నామినేట్ అయ్యింది. అలాగే బెస్ట్ యాక్టర్ ఇన్ యాక్షన్ మూవీ కేటగిరిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ నామినేట్ అయ్యారు. ఈ అవార్డ్స్ విజేతలను మార్చి 16న ప్రకటించనున్నారు.

ఇవి కూడా చదవండి

జనవరిలో గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ 2023లో ఆర్ఆర్ఆర్ చిత్రం సత్తా చాటింది. ప్రస్తుతం రామ్ చరణ్ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ గుడ్ మార్నింగ్ అమెరికా అనే పాపులర్ టీవీ షోలో పాల్గొన్నారు చెర్రీ. ఇందులో ఆర్ఆర్ఆర్ జర్నీతోపాటు.. వ్యక్తిగత విషయాలను పంచుకోనున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.