RRR Movie Pre Release Event Highlights: తెలుగు సినిమా ప్రేక్షకులే కాకుండా యావత్ ఇండియన్ సినీ లవర్స్ ఆర్‌ఆర్‌ఆర్ (RRR) సినిమాకోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అపజయం ఎరగని రాజమౌళి (NTR) దర్శకత్వం, ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్ (Ram Charan) హీరోలుగా తెరకెక్కుతుండడంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు ఆకాశాన్ని అంటేలా ఉన్నాయి. ఈ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రాజమౌళి అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఆర్‌ఆర్‌ఆర్ టీఎమ్ ప్రమోషన్స్ విషయంలోనూ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే ముంబయిలో ప్రిరిలీజ్ ఈవెంట్‌ను జరుపుకున్న చిత్ర యూనిట్ తాజాగా మళ్లీ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచేసింది.
మార్చి 25న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రచారాన్ని హోరెత్తించిన ఆర్‌ఆర్‌ఆర్‌టీమ్ శుక్రవారం దుబాయ్‌లో ఈవెంట్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా సౌత్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ.. కర్ణాటకలోని చిక్‌బడాపూర్‌లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సన్నద్ధమవుతోంది. ఈ విషయమై రాజమౌళి ఓ వీడియోను షేర్ చేశారు. ఎగ్జైట్‌మెంట్‌ను ఆపుకోలేకపోతున్నామని, బిగ్ ఈవెంట్ జరగనుందని, ఎన్నో ఏళ్ల తర్వాత అందరినీ కలవబోతున్నామని చెప్పుకొచ్చారు.
స్టేజ్‌పైకి వచ్చిన దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. ‘భౌతికంగా మన మధ్య లేకపోయినా, పునీత్ రాజ్ కుమార్ మనసుల్లో ఉన్నారనడానికి జేమ్స్ సూపర్ హిట్ కావడమే సాక్ష్యం. మనకు ఆశీస్సులు ఇవ్వడానికి ఆయన మధ్యే ఉన్నారు. నిర్మాత దానయ్యగారికి ధన్యవాదాలు. నా అసిస్టెంట్ డైరెక్టర్లందిరికీ కృతజ్ఞతలు. కన్నడ, తెలుగు అభిమానులతో ఇక్కడ అపూర్వమైన సంగమాన్ని చూస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. సినిమా టికెట్ల ధరలను పెంచి తమ మద్ధతు అందించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపారు.
రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లు స్టేజ్‌పైకి వచ్చారు. వీరికి ఆహ్వానం పలుకుతూ చేసిన క్రాకర్స్ ఆకట్టుకున్నాయి. అంతకుముందు సింగర్స్ సినిమాలోనూ పాటలను ఆలపించిన తీరు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది.
ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న కీరవాణి మాట్లాడుతూ.. ‘రాజమౌళి, రామరావు, రామ్ చరణ్ కెరీర్‌లోనే ఈ సినిమా బెస్ట్‌గా నిలుస్తుంది. ఈ సినిమా కోసం అందరూ కష్టపడి చేశారు. కొంచెం ఆలస్యమైనా మంచి ఫలితం వస్తుంది. దానయ్య గారి నిరీక్షణకు ఫలితం. చాలా సంతోషంగా ఉంది’ అని చెప్పుకొచ్చారు.
అంగరంగ వైభవంగా జరుగుతోన్న ఆర్ఆర్‌ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై కాసేపటి క్రితం హాజరయ్యారు. కళాకారుల నృత్య ప్రదర్శనలతో సభా ప్రాంగణంలో హోరెత్తుతోంది.
ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హీరోలు రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లతో పాటు.. చిత్ర దర్శకుడు రాజమౌళి కాసేపటి క్రితమే వేడుక వద్దకు చేరుకున్నారు. తమ అభిమాన హీరోలను చూసిన ఫ్యాన్స్ హంగామా చేశారు.
అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్ ప్రారంభమైంది. వేడుకకు సౌత్ ఇండియాకు చెందిన ఫ్యాన్స్ పెద్ద ఎత్తున హాజరయ్యారు. దీంతో సభా ప్రాంగణమంతా జనసంద్రంగా మారింది. ఇప్పటికే వేడుకకు రమా రాజమౌళితో పాటు, సంగీత దర్శకుడు కీరవాణి హాజరయ్యారు. మరికాసేపట్లో రాజమౌళితో పాటు, రామ్ చరణ్, ఎన్టీఆర్ వేదిక వద్దుకు రానున్నారు.
ఎటు చూసినా.. జై ఎన్టీఆర్.. జై తారక్ నినాదాలతో హోరెత్తిస్తున్నారు ఫ్యాన్స్. అరుపులు, కేకలతో సభాప్రాంగణం వద్ద ఆర్‌ఆర్‌ఆర్ జెండాలతో హంగామా చేస్తున్నారు. ఇక మరికాసేపట్లో చిత్ర యూనిట్ వేడుక వద్దకు చేరుకోనుంది.
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ చరిత్రలో అత్యంత భారీగా చేపట్టిన ఆర్‌ఆర్‌ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అభిమానులు భారీగా తరలివస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇలా ఏంకగా నాలుగు రాష్ట్రాల నుంచి అభిమానులు వేడకకు చేరుకుంటున్నారు.
RRR సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుగుతున్న వేదిక వద్ద అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఓ దశలో అభిమానులను కంట్రోల్ చేయడం కష్టంగా మారింది. ఒక్కసారిగా ఫ్యాన్స్ బారికెడ్లు తోసుకుని రావడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. కుర్చీలు విరిగాయి.
ఆర్ఆర్ఆర్ చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే వార్త చెప్పింది. సాధారణ థియేటర్లో మొదటి మూడు రోజులకు 50 రూపాయలు తర్వాత వారం రోజులకు 30 రూపాయలు పెంచుకునే అవకాశం కలిపించింది. ఐమాక్స్ థియేటర్లలో మొదటి మూడు రోజులు వంద రూపాయలు తర్వాత వారం రోజులు 50 రూపాయలు పెంచుకునే అవకాశం కల్పించింది.
ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్ జరుగుతోన్న ప్రదేశానికి అభిమానులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. జై ఎన్టీఆర్, జై రామ్ చరణ్ అంటూ నినాదాలు చేస్తున్నారు.