దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో నటిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. అజయ్ దేవగణ్.. శ్రియా సరన్.. సముద్రఖని కీలకపాత్రలలో నటిస్తున్నారు.. సినీ ప్రపంచంలో ఇప్పుడెక్కడా చూసినా.. ట్రిపులార్ మానియానే. మూవీని ఎప్పుడెప్పుడు చూస్తామా అని వేయి కళ్లతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది సినీజనం. రిలీజ్కు ముందే ఇండియన్ మూవీస్ రికార్డ్లను తిరగరాస్తోంది ఆర్ఆర్ఆర్. తాజాగా విడుదలకు ఇంకా కొద్ది గంటలు ఉండగా.. అభిమానులకు షాకిచ్చారు మేకర్స్.
కేవలం హైదరాబాద్లోని ఐదు థియేటర్లలో మాత్రమే బెనిఫిట్ షో ప్రదర్శించడానికి అనుమతినిస్తూ ఉత్తర్వూలు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. మార్చి 25 నుంచి ఏప్రిల్ 4 వరకు ఆర్ఆర్ఆర్ సినిమాకు 5 షోస్ ప్రదర్శించవచ్చు.. అంటే. 7.00 AM టూ 1.00 AM వరకు ఎక్స్ ట్రా షో ప్రదర్శించవచ్చు. ఆ థియేటర్స్ వివరాలు ఇవే.
* భ్రమరాంబ థియేటర్.. కూకట్ పల్లి..
* మళ్లీకార్జున థియేటర్.. కూకట్ పల్లి..
* విశ్వనాథ థియేటర్.. కూకట్ పల్లి..
* అర్జున్ థియేటర్.. కూకట్ పల్లి..
* శ్రీరాములు థియేటర్.. మూసాపేట్..
పైన పేర్కోన్న థియేటర్లలో మాత్రమే ఆర్ఆర్ఆర్ బెనిఫిట్ షోస్ ప్రదర్శించడానికి అనుమతినిచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఈ థియేటర్లో నిబంధనలకు అనుగుణంగా సినిమా ప్రదర్శించడం జరుగుతుందా అనే విషయాన్ని సైబరాబాద్ పోలీసులు చూసుకోవాలంటూ తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.
Also Read: కార్తీకదీపం లెక్కలు మారిపోతున్నాయ్.. తికమక, సాగతీతతో ప్రేక్షకులలో విసుగు.. చివరకు..
Nithiin: మాచర్ల నియోజకవర్గం మూవీ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యేది అప్పుడే..
RRR: విడుదలకు ముందే ఊచకోత.. ప్రీమియర్స్లో ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్ల సునామీ.. ఆ రికార్డ్ బ్రేక్’