Yash : అనంత్ అంబానీ పెళ్ళికి రాకీ భాయ్.. కేకపెట్టించిన యాష్ నయా లుక్

యష్‌కి విపరీతమైన అభిమానులు ఉన్నారు. దేశ విదేశాల్లో ఆయనకు అభిమానులున్నారు. ఇదంతా 'కేజీఎఫ్', 'కేజీఎఫ్ 2' సినిమాల వల్లే సాధ్యం అయ్యింది. కేజీఎఫ్ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించింది. దాంతో యష్ పాపులారిటీ పెరిగింది. ఈ సినిమాలో యష్ పొడవాటి గడ్డం, జుట్టుతో అందరి దృష్టిని ఆకర్షించాడు.

Yash : అనంత్ అంబానీ పెళ్ళికి రాకీ భాయ్.. కేకపెట్టించిన యాష్ నయా లుక్
Yash
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 12, 2024 | 10:32 PM

‘కేజీఎఫ్ 2’ తర్వాత ‘టాక్సిక్’ సినిమాతో బిజీగా ఉన్నాడు నటుడు యష్. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజా ముఖేష్ అంబానీ కుమారుడి వివాహానికి కూడా యశ్‌కు కూడా ఆహ్వానం అందింది. దాంతో యష్ అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహానికి వెళ్ళాడు. భార్యతో కలిసి ముంబై కు వెళ్ళాడు యాష్. ఈ క్రమంలో ఆయన లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది. యష్ ‘టాక్సిక్’ సినిమా లుక్ రివీల్ అయింది. యష్ తన కొత్త హెయిర్ స్టైల్‌ అదిరిపోయింది.

యష్‌కి విపరీతమైన అభిమానులు ఉన్నారు. దేశ విదేశాల్లో ఆయనకు అభిమానులున్నారు. ఇదంతా ‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్ 2’ సినిమాల వల్లే సాధ్యం అయ్యింది. కేజీఎఫ్ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించింది. దాంతో యష్ పాపులారిటీ పెరిగింది. ఈ సినిమాలో యష్ పొడవాటి గడ్డం, జుట్టుతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడు కొత్త సినిమా కోసం తన స్టైల్ మార్చేశాడు.

మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘టాక్సిక్’. ఈ సినిమా టైటిల్ టీజర్‌ను ఇటీవలే విడుదల చేశారు. ఈ టీజర్ చూసిన చాలా మందికి ఇది డ్రగ్స్ నేపథ్యంలో సాగే ఎరోటిక్ మూవీ అని అర్ధమైపోయింది. భారీ యాక్షన్ ఉంటుందని అంటున్నారు. యష్ లుక్ ఎలా ఉంటుందో అని చాలా మంది ఎదురుచూశారు. మొత్తానికి దానికి సమాధానం దొరికింది. యష్ తన హెయిర్ స్టైల్ ను మార్చేశాడు. ‘కేజీఎఫ్ 2’ సినిమాలో జుట్టు పొడవుగా లేదు. అతని గడ్డం అలాగే ఉంది. గడ్డం లుక్ కాస్త మారిపోయింది. అతడిని చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘టాక్సిక్’ సినిమాలో నటీనటుల గురించి జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో కరీనా కపూర్ నటిస్తుందని వార్తలు వచ్చాయి.. నటీనటులను టీమ్ గోప్యంగా ఉంచింది. ఈ సినిమా ఏప్రిల్ 2025లో విడుదల కానుందని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!