Kantara: క్లైమాక్స్‏లో ఏం జరుగుతుందో వాళ్లకు అస్సలు తెలియదు.. కాంతార పై హీరో రిషబ్ శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు..

|

Dec 09, 2022 | 3:34 PM

కాంతార చిత్రం గురించి ఎన్నో విషయాలను చెప్పుకొచ్చిన హీరో రిషబ్ శెట్టి తాజాగా మరిన్ని విషయాలను బయటపెట్టారు. తాను చిన్నప్పటి నుంచి పంజర్లీ దేవతను నమ్ముతానని.. ఆ దైవాన్ని పూజిస్తానని అన్నారు.

Kantara: క్లైమాక్స్‏లో ఏం జరుగుతుందో వాళ్లకు అస్సలు తెలియదు.. కాంతార పై హీరో రిషబ్ శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు..
Kantara
Follow us on

కాంతార.. ట్రిపుల్ ఆర్.. కేజీఎఫ్.. పుష్ప తర్వాత బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన చిత్రం. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ దేశవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టింది. అటు థియేటర్లలో కాకుండా..ఇటు ఓటీటీలోనూ సినీ ప్రియులను ఆకట్టుకుంది. 20 నిమిషాల క్లైమాక్స్… రిషబ్ శెట్టి నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. దైవం ఆవహించిన సమయంలో వచ్చే ఓ శబ్దం గూస్ బంప్స్ వచ్చేలా చేసింది. అంతేకాకుండా.. ఆదివాసీల సంప్రదాయం.. పింజర్లీ దేవత గురించి ప్రపంచానికి తెలియజేసింది కాంతార చిత్రం. ఈ సినిమా గురించి ఎన్నో విషయాలను చెప్పుకొచ్చిన హీరో రిషబ్ శెట్టి తాజాగా మరిన్ని విషయాలను బయటపెట్టారు. తాను చిన్నప్పటి నుంచి పంజర్లీ దేవతను నమ్ముతానని.. ఆ దైవాన్ని పూజిస్తానని అన్నారు.

రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. “ఇది మాటల్లో వర్ణించలేని అనుభవం. నేను పంజర్లీ దేవతను నమ్ముతాను.. పూజిస్తాను. నేను పూజలు చేసి ఆ తర్వాత సన్నివేశాలను చిత్రీకరించడానికి సిద్ధమయ్యేవాడిని. చిన్నప్పటి నుండి ఆ ఆచారాన్ని చూస్తున్నాను. ఆభూత కోల ఆచారానికి సంబంధించిన వీడియోలను చూసి.. ఆ అనుభవాన్ని ఓ రచయితగా నోట్స్ రాసుకున్నాను. అలాగే నిజ జీవితంలో పంజర్లీ దైవం ఆవహించిన వారిని కూడా చూశాను. ఆ సీక్వెన్స్‌ని స్క్రిప్ట్‌లో కేవలం ఒక లైన్‌లో రాసుకున్నాను”

ఇవి కూడా చదవండి

“కానీ సినిమా క్లైమాక్స్‌లో వచ్చే పంజర్లీ సీక్వెన్స్‌ని కేవలం ఒక లైన్‌లో మాత్రమే రాసుకున్నాను.. పూర్తిగా రాయలేదు.. ఆ సన్నివేశం గురించి కేవలం నా మనస్సులో నాలుగు విజువల్స్ ఉన్నాయి. అందుకే మొదటి షాట్ వరకు, ప్రేక్షకులకు, చిత్రయూనిట్ కు ఏం జరగబోతుందో తెలియదు. నాలుగు విజువల్స్ చిత్రీకరించిన తర్వాత వారికి అర్థమైంది. అలాగే.. ఓ అనే శబ్దం నేను అరిచినదే.. డబ్బింగ్ సమయంలోనూ దానిని మార్చలేదు. నేను దైవ కోల సమయంలో మళ్లీ షూట్ చేసేందుకు ప్రయత్నించాను. కానీ అది సరిగ్గా రాలేదు. అందుకే అన్ని భాషల్లోనూ నా గొంతునే ఉపయోగించాము” అంటూ చెప్పుకొచ్చారు.