Vyuham Movie Trailer: ఆకట్టుకుంటోన్న ఆర్జీవీ వ్యూహం మూవీ ట్రైలర్.. నేను నమ్మిందే సినిమాగా తీశానంటున్న వర్మ
ఏం కథ తెరకెక్కిస్తారో అనే ఇంట్రెస్ట్ ప్రేక్షకుల్లో క్రియేట్ చేస్తారు ఆర్జీవీ. ఇక ఇప్పుడు ఆయన ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అయిన సమయంలో జరిగిన పరిణామాల ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. వ్యూహం అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. వ్యూహం సినిమా మొదటి పార్ట్ ను నవంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న లేటెస్ట్ మూవీ వ్యూహం. ఏపీ రాజకీయ పరిణామాల పై సినిమా తెరకెక్కిస్తున్నారు వర్మ. ఆర్జీవీ సినిమా అంటేనే సెన్సేషన్. ఏం కథ తెరకెక్కిస్తారో అనే ఇంట్రెస్ట్ ప్రేక్షకుల్లో క్రియేట్ చేస్తారు ఆర్జీవీ. ఇక ఇప్పుడు ఆయన ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అయిన సమయంలో జరిగిన పరిణామాల ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. వ్యూహం అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. వ్యూహం సినిమా మొదటి పార్ట్ ను నవంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తి క్రియేట్ చేశాయి. తాజాగా వ్యూహం సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
ఈ ట్రైలర్ లో జగన్ పై చంద్రబాబు చేసిన కుట్ర అంటూ చూపించారు. అలాగే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర కూడా చూపించారు. ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా ఉన్న స్కిల్ డవలప్ మెంట్ విషయాన్నీ కూడా ఈ ట్రైలర్ లో ప్రస్తావించారు.
ఈ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆర్జీవీ మాట్లాడుతూ.. ఈ సినిమా వెనుక ఎలాంటి వ్యూహం ఏమి లేదు నిజం మాత్రమే ఉంది అని అన్నారు. అలాగే వ్యూహం సినిమా రెండు భాగాలుగా వస్తుంది. వైఎస్ మరణం తరువాత నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాల తో ఈ రెండు సినిమాలు ఉంటాయి అని అన్నారు. అదేవిధంగా నేను చాలా సౌమ్యుడుని,నేను ఎప్పుడు చంద్రబాబు ని కలవలేదు, నాకు జగన్ అంటే ఒక అభిప్రాయం ఉంది చంద్రబాబు అంటే ఒక అభిప్రాయం ఉంది. నిజమనేది ఈ సినిమాలో చూస్తారు అని అన్నారు. జగన్ మీద నాకు ఉన్న అభిప్రాయం సినిమాలో కనిపిస్తుంది. మిగతా వారి పై నాకు అభిప్రాయం లేదు. నేను వేరే వాళ్ళ మీద సినిమా తియ్య మంటే తియ్యాను. ఈ సినిమాలో నేను నమ్మిన నిజం మాత్రమే ఉంది. పబ్లిక్ డొమైన్ లో ఉన్న జీవితాలను సినిమా తియ్యడానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు. నేను లక్ష్మిస్ ఎన్టీఆర్ , సర్కార్ సినిమాలు అలా తీసినవే. నేను జగన్ మీద ఉన్న అభిమానంతో సినిమా తీసాను కానీ ఇక్కడ ప్యాకేజ్ అనేదానికి ఆస్కారం లేదు. నాకు టిడిపి గురించి కానీ వైసిపి గురించి కానీ వేరే పార్టీ గురించి కానీ తెలీదు. నేను నమ్మిన నిజం చెపుతున్నాను. నా రీసెర్చ్ లో వెనుక ఏమి జరిగింది అనేది ఈ సినిమా. రియాలిస్టిక్ సినిమా అంటే అది వాళ్ళ పాయింట్ ఆఫ్ లో ఉంటుంది. అలాగే ఈ సినిమా లో చిరంజీవి పాత్ర కూడా ఉంటుంది అని అన్నారు ఆర్జీవీ.
Here is VYOOHAM trailer https://t.co/3CVFnMzHBY #VyoohamTrailer
— Ram Gopal Varma (@RGVzoomin) October 13, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..