AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RGV Prabhas: నేను అడిగిన ప్రశ్నకు ప్రభాస్ ఇచ్చిన ఆన్సర్ విని ఆశ్చర్యపోయా.. రామ్ గోపాల్ వర్మ..

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ దర్శకులలో రామ్ గోపాల్ వర్మ ఒకరు. ఒకప్పుడు తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన ఆయన.. ఇప్పుడు దర్శకత్వానికి దూరంగా ఉంటున్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. లేటేస్ట్ చిత్రాలపై తన అభిప్రాయాలను తెలియజేస్తూనే.. మరోవైపు పలు విషయాలపై స్పందిస్తున్నారు. గతంలో ఓ ఇంటర్వులో వర్మ చేసిన కామెంట్స్ ఇఫ్పుడు వైరలవుతున్నాయి.

RGV Prabhas: నేను అడిగిన ప్రశ్నకు ప్రభాస్ ఇచ్చిన ఆన్సర్ విని ఆశ్చర్యపోయా.. రామ్ గోపాల్ వర్మ..
Ram Gopal Varma, Prabhas
Rajitha Chanti
|

Updated on: Jun 16, 2026 | 5:30 PM

Share

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమాలకు ఉండే ఫాలోయింగ్ సైతం తెలిసిందే. ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన ఆయన.. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. హీరో ప్రభాస్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే తాను అడిగిన ప్రశ్నకు డార్లింగ్ ఇచ్చిన ఆన్సర్ విని షాకయ్యానని అన్నారు. అసలు విషయానికి వస్తే.. టాలీవుడ్ జక్కన్న ఎస్.ఎస్. రాజమౌళి, రెబెల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘బాహుబలి’ చిత్రం భారతీయ సినీ చరిత్రను తిరగరాసింది. ఈ సినిమా కోసం ప్రభాస్ తన కెరీర్‌లో అత్యంత కీలకమైన ఐదేళ్ల కాలాన్ని కేటాయించారు. అయితే, ఈ ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో ప్రభాస్ చూపించిన అంకితభావం, దర్శకుడిపై ఆయనకున్న నమ్మకం గురించి రామ్ గోపాల్ వర్మ చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Naga Chaitanya : అప్పుడు నాగార్జున జోడిగా.. ఇప్పుడు నాగచైతన్య సినిమాలో సీనియర్ హీరోయిన్.. ఎవరంటే..

6 నెలలు కాదు.. 6 ఏళ్లయినా ఇస్తాను!

ఒకానొక సందర్భంలో ఆర్‌జీవీ స్వయంగా ప్రభాస్‌ను ఒక ప్రశ్న అడిగారట. ఒకే సినిమా కోసం ఆరు నెలల పాటు పూర్తి సమయాన్ని కేటాయించడం పట్ల ఎప్పుడైనా విచారం లేదా బాధ కలిగిందా అని ఆర్‌జీవీ ప్రశ్నించగా.. ప్రభాస్ ఇచ్చిన సమాధానం తనను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసిందని వర్మ వెల్లడించారు. “”సర్, ద వే ఫిల్మ్ ఈజ్ షేపింగ్ అప్, ఈ సినిమా షేప్ అవుతున్న విధానం చూస్తుంటే.. మూడు సంవత్సరాలు కాదు, ఇప్పుడు ఇప్పుడే ఆరు సంవత్సరాలు అడిగినా నేను రాజమౌళి గారికి ఇచ్చేస్తాను” అని ప్రభాస్ ఎంతో నమ్మకంతో బదులిచ్చారట.

ఎక్కువ మంది చదివినవి : పెళ్లి ఫంక్షన్లలో పని.. రూ.500 జీతం కోసం ఎన్నో కష్టాలు.. కట్‌చేస్తే టాలీవుడ్ క్వీన్..

ప్రభాస్ కమిట్‌మెంట్‌కు ఆర్‌జీవీ హాట్సాఫ్

ప్రభాస్ నోట వచ్చిన ఈ మాటలు ఆయనకు సినిమా పట్ల ఉన్న అపారమైన కమిట్‌మెంట్‌ను, ప్రాజెక్ట్ విజయంపై ఆయనకున్న దృఢమైన నమ్మకాన్ని తెలియజేస్తాయని ఆర్‌జీవీ ప్రశంసించారు. ఒక స్టార్ హీరో తన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సామాన్యమైన విషయం కాదని, అది కేవలం ప్రభాస్‌కు మాత్రమే సాధ్యమైందని ఆయన అన్నారు. దర్శకుడు రాజమౌళి తన నిజాయితీ, పని పట్ల ఉన్న నిబద్ధత ద్వారానే ప్రభాస్‌లో అలాంటి అచంచలమైన విశ్వాసాన్ని కలిగించగలిగారని ఆర్‌జీవీ వివరించారు. కథపై దర్శకుడికి ఉన్న స్పష్టత, నటీనటులను నడిపించే తీరు చూశాకే ప్రభాస్ తన సర్వస్వాన్ని ఆ సినిమా కోసం ధారపోశారని, అందుకే ‘బాహుబలి’ అంతటి ప్రపంచ స్థాయి విజయాన్ని సాధించిందని అన్నారు. నిజానికి బాహుబలి సినిమాతో ప్రభాస్ స్థాయి ప్రపంచవ్యాప్తంగా మారిపోయింది.

ఎక్కువ మంది చదివినవి :  Tollywood : ఏం పాట రా బాబు.. అప్పట్లో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది.. ఇప్పటికీ ట్రెండింగ్ ఈ సాంగ్..

ఎక్కువ మంది చదివినవి : దాసరి, చిరంజీవి చేతుల మీదుగా అవార్డ్ అందుకుంటున్న నటుడిని గుర్తుపట్టారా.. ? ఇప్పుడు జబర్దస్త్ షోలో ఫేమస్ కమెడియన్..

Follow Us