AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

My Name Is Shruthi: ఇలాంటి సినిమా నేనెప్పుడూ చేయలేదంటున్న బ్యూటీ.. ఆసక్తికరంగా హన్సిక సినిమా

దేశముదురు సినిమాతో పరిచయమైన చిన్నది హన్సిక. తొలి సినిమాతోనే క్యూట్ లుక్స్ తో కుర్రాళ్ళ గుండెల్ని కొల్లగొట్టింది ఈ భామ.

My Name Is Shruthi: ఇలాంటి సినిమా నేనెప్పుడూ చేయలేదంటున్న బ్యూటీ.. ఆసక్తికరంగా హన్సిక సినిమా
Hansika
Rajeev Rayala
|

Updated on: Mar 23, 2022 | 8:13 AM

Share

Hansika Motwani: దేశముదురు సినిమాతో పరిచయమైన చిన్నది హన్సిక(Hansika). తొలి సినిమాతోనే క్యూట్ లుక్స్ తో కుర్రాళ్ళ గుండెల్ని కొల్లగొట్టింది ఈ భామ. దేశముదురు(Desamuduru )సినిమా తర్వాత వరుసగా తెలుగులో అవకాశాలు  అందుకుంది ఈ బ్యూటీ. తెలుగుతోపాటు తమిళ్ లోనూ ఈ వయ్యారి అవకాశాలు అందుకుంది. అయితే ఈ మధ్య కాలంలో హన్సిక జోరు తగ్గిందనే చెప్పాలి. కమర్షియల్ మూవీస్ తో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసింది. తాజాగా ఓ ఇంట్రస్టింగ్ సినిమాతో రాబోతుంది హన్సిక. ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటి వరకు రానటువంటి ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో, భిన్నమైన నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘మై నేమ్‌ ఈజ్‌ శృతి’. మనిషి చర్మం వలిచి బిజినెస్‌ చేసే ఓ గ్యాంగ్‌తో ఓ యువతి చేసే పోరాటమే ఈ సినిమా కథ. ఈ సినిమాకు శ్రీనివాస్‌ ఓంకార్‌.

ఈమూవీలో హాన్సిక టైటిల్‌ రోల్‌ పోషిస్తుంది. ఇటీవల విడుదలైన టీజర్‌లో చర్మం వలిచి బిజినెస్ చేస్తానమంటున్నారు ఏం చేయాలి వాళ్లను అంటూ కథానాయిక హాన్సిక చెప్పే డైలాగ్‌తో సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. లేడి ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై బురుగు రమ్య ప్రభాకర్ నిర్మిస్తున్నారు. ఇటీవల తెలుగులో విడుదలైన టీజర్ మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమానుంచి ‘రెప్పే వేసేలోగా మారిందేమో నా రాత.. తప్పే చేసే లాగా ముప్పే వచ్చే నా వెంట’ అంటూ కొనసాగే టైటిల్‌ లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. మార్క్‌రాబీన్‌ సంగీత దర్శకత్వంలో కృష్ణకాంత్‌ (కెకె) సాహిత్యం అందించిన ఈ పాటను హారిక నారాయణ ఆలపించారు. ఈ సందర్భంగా కథానాయిక హాన్సిక మాట్లాడుతూ..ఈ మూవీలో నటించినందుకు ఎంతో ఆనందంగా వుంది. ఇలాంటి ఓ ఇంటెన్స్‌ స్టోరీని నేను ఎప్పుడూ చేయలేదు. సినిమాలో వుండే ట్విస్ట్‌లు అందరిని ఆశ్చర్యపరుస్తాయి. ఈ మూవీలో ఈ పాట టైటిల్‌ సాంగ్‌గా వస్తుంది. తప్పకుండా ఈ సాంగ్‌తో పాటు సినిమా కూడా అందర్ని అలరిస్తుందనే నమ్మకం వుంది’ అన్నారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Raashi Khanna: బొద్దుగా ఉన్నందుకు అలా వెటకారంగా పిలిచేవారు.. బాడీ షేమింగ్‌ ట్రోలింగ్‌ను గుర్తు చేసుకున్న రాశి..

Viral Video: ఇదేం ఫాలోయింగ్‌ రా బాబూ!.. గులాబీ పూలతో ఆ హీరో వెంటపడిన అమ్మాయిలు.. నెట్టింట్లో వైరల్‌ వీడియో..

Chiranjeevi: జాతీయ సాంస్కృతిక మహోత్సవాల సక్సెస్‌కు మెగాస్టార్‌ పిలుపు.. ఉత్సవాలు ఎప్పటినుంచంటే..

Follow Us
హాఫ్ శారీలో తళుక్కుమన్న నటి రోజా.. ఫొటోస్ ఇదిగో
హాఫ్ శారీలో తళుక్కుమన్న నటి రోజా.. ఫొటోస్ ఇదిగో
ఎప్పుడూ ఒకే కప్పులో టీ ఎందుకు తాగుతారు?సైకాలజీ చెప్పే రహస్యాలుఇవే
ఎప్పుడూ ఒకే కప్పులో టీ ఎందుకు తాగుతారు?సైకాలజీ చెప్పే రహస్యాలుఇవే
రష్మిక అన్నా అని పిలిచే టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?
రష్మిక అన్నా అని పిలిచే టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?
పచ్చిమిరపకాయలు త్వరగా పాడువుతున్నాయా.. ఇలా చేస్తే 15 రోజులైనా..
పచ్చిమిరపకాయలు త్వరగా పాడువుతున్నాయా.. ఇలా చేస్తే 15 రోజులైనా..
రొయ్య రైతు పొలికేక...! బరువు దించే నాథుడెక్కడ?
రొయ్య రైతు పొలికేక...! బరువు దించే నాథుడెక్కడ?
ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌ పెడుతున్నారా..? అయితే, ఈ వీడియో మీ కోసమే..!
ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌ పెడుతున్నారా..? అయితే, ఈ వీడియో మీ కోసమే..!
రైలులో ఎన్ని కేజీల లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా? లిమిట్‌ మించితే..
రైలులో ఎన్ని కేజీల లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా? లిమిట్‌ మించితే..
కొత్తిమీర వీరికి యమ డేంజర్.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..
కొత్తిమీర వీరికి యమ డేంజర్.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..
తెలుసుకోండి.. ఒకసారి కాదు, రెండు సార్లు పెళ్లి చేసుకునే రాశులివే
తెలుసుకోండి.. ఒకసారి కాదు, రెండు సార్లు పెళ్లి చేసుకునే రాశులివే
తొలి ఏకాదశి..విష్ణుమూర్తి కృప కోసం 12 రాశుల వారు చేయాల్సినవి ఇవే!
తొలి ఏకాదశి..విష్ణుమూర్తి కృప కోసం 12 రాశుల వారు చేయాల్సినవి ఇవే!