ఆంద్రప్రదేశ్‍లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని మోదీతోపాటు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు హాజరవుతున్నారు. చంద్రబాబుతోపాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మరికొందరు మంత్రులు హాజరుకానున్నారు. అలాగే మొట్టమొదటి సారి పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తుండడంతో మెగాస్టార్ చిరంజీవితోపాటు సాయి ధరమ్ తేజ్, రామ్ చరణ్, మెగా ఫ్యామిలీ, సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి వస్తున్నారు. ఇప్పటికే మెగా అభిమానులు భారీ ఎత్తున ప్రమాణ స్వీకార వేదిక వద్దకు చేరుకున్నారు. మరోవైపు మెగా ఫ్యామిలీ మొత్తం ప్రత్యేక బస్సులలో ప్రమాణ స్వీకార వేదిక వద్దకు బయలుదేరారు. అలాగే తండ్రి కోసం అకీరా నందన్, ఆద్య కూడా గన్నవరం వచ్చేశారు.
పవన్ ప్రమాణ స్వీకారానికి అకిరా, ఆద్య సంప్రదాయంగా పద్దతిగా రెడీ అయ్యారు. అకిరా పంచె కట్టగా.. ఆద్య ఎంతో చక్కగా ట్రెడిషనల్ గా కనిపిస్తుంది. అన్నచెల్లెలు ఇద్దరూ చాలా చక్కగా రెడీ అయ్యి తమ తల్లి రేణు దేశాయ్ కు వీడియో కాల్ చేశారు. తన పిల్లల ఫోటో షేర్ చేస్తూ పవన్ కళ్యాణ్ కు విషెస్ తెలిపింది దేణూ దేశాయి. “నా పిల్లలు వాళ్ల నాన్న బిగ్గెస్ట్ డే రోజు ఇలా రెడీ అయ్యారు. కళ్యాణ్ గారికి ఏపీ స్టేట్ కి .. ప్రజలకు మంచి చేయాలని శుభాకాంక్షలు” అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం రేణూ దేశాయ్ పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.