
పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తండ్రిబాటలోనే హీరోగా ఎంట్రీ ఇస్తాడని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ అకిరా మాత్రం నటనపై అసలు ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించడం లేదు. నటనపై కాకుండా సంగీతంపై మక్కువ పెంచుకున్నాడు. ఇప్పటికే పియానో ఎంతో బాగా ప్లే చేస్తాడన్న సంగతి తెలిసిందే. అమెరికాలోని ఓ ఫిలిం స్కూల్లో సంగీతం నేర్చుకుంటున్నాడని తెలుస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో బెంగుళూరులో జరిగిన మెగా ఫ్యామిలీ సంక్రాంతి సంబరాల్లో అకిరా స్పెషల్ అట్రాక్షన్ అయ్యాడు. లాంగ్ హెయిర్ స్టైల్ తో వింటేజ్ పవన్ ను గుర్తుచేశాడు. అలాగే యానిమల్ సినిమాలోని నాన్న నువ్వు నా ప్రాణం .. పాటకు పియానో ప్లే అదుర్స్ అనిపించాడు. అకిరాకు సంబంధించిన విషయాలను, ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు రేణు దేశాయ్. అకిరా పియానో ప్లే చేయడం.. చెల్లెలు ఆద్యతో కలిసి సరదాగా ఉన్న క్షణాలను చాలాసార్లు నెట్టింట అభిమానులతో పంచుకున్నారు. ఇక ఇప్పుడు అకిరాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేశారు రేణు దేశాయ్.
ఆ వీడియోలో అకిరా శివలింగం ముందు ఆధ్యాత్మికంగా కనిపిస్తూనే.. మరోవైపు ఏదో సీరియస్ గా కసరత్తులు చేస్తూ కనిపించాడు. సూర్యాస్తమయంలో అకిరా కనిపిస్తుండడంతో అసలు అకిరా ఏం చేస్తున్నాడు అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. మై వారియర్.. సూర్యాస్తమయ సమయంలో తనకు నచ్చిన ప్రదేశంలో తనకు కావాల్సింది వెతుకుతున్నాడు అంటూ రాసుకొచ్చింది. అలాగే కామెంట్ బాక్స్ సైతం క్లోజ్ చేయడంతో అకిరా వీడియోపై నెటిజన్స్ రియాక్ట్ కాలేకపోతున్నారు. ప్రస్తుతం అకిరా స్పెషల్ వీడియో మాత్రం నెట్టింట వైరలవుతుంది.
ఇదిలా ఉంటే.. అకిరా నందన్.. మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని తెలుస్తోంది. ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు.. ప్రొడ్యూసర్స్ మాత్రమే ఎంట్రీ ఇచ్చారు. కానీ మొదటిసారి మ్యూజిక్ డైరెక్టర్ ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తోంది. భవిష్యత్తులో అకిరా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కానున్నాడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న రేణు దేశాయ్ ఇటీవలే టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మాస్ మాహారాజా రవితేజ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ అందుకుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.