Pawan Kalyan: పవన్ కళ్యాణ్ గెలుపుపై రేణు దేశాయ్ ఆసక్తికర పోస్ట్.. ఏమన్నారంటే..

ఇటు తెలుగు రాష్ట్రాల్లో పవన్ అభిమానులు సంబరాలు చేసుకుంటారు. ఇప్పటికే భారీ సంఖ్యలో ఫ్యాన్స్ పవన్ ఇంటికి చేరుకోగా.. పలువురు సినీ సెలబ్రెటీలు పవన్ ను విష్ చెస్తూ పోస్టులు పెడుతున్నారు. సాయి ధరమ్ తేజ్, నితిన్, మెగాస్టార్ చిరంజీవి, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ పవన్ కు అభినందనలు తెలుపుతూ పోస్టులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇక పవన్ గెలుపుపై ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ గెలుపుపై రేణు దేశాయ్ ఆసక్తికర పోస్ట్.. ఏమన్నారంటే..
Renu Desai, Pawan Kalyan

Updated on: Jun 04, 2024 | 5:15 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి భారీ విజయం దిశగా దూసుకెళ్తుంది. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా విజయకేతనం ఎగురవేశారు. దాదాపు 70 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. దీంతో జనసేన అధినేత గెలుపుపై సినీ పరిశ్రమలోని నటీనటులు, డైరెక్టర్స్, నిర్మాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో పవన్ అభిమానులు సంబరాలు చేసుకుంటారు. ఇప్పటికే భారీ సంఖ్యలో ఫ్యాన్స్ పవన్ ఇంటికి చేరుకోగా.. పలువురు సినీ సెలబ్రెటీలు పవన్ ను విష్ చెస్తూ పోస్టులు పెడుతున్నారు. సాయి ధరమ్ తేజ్, నితిన్, మెగాస్టార్ చిరంజీవి, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ పవన్ కు అభినందనలు తెలుపుతూ పోస్టులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇక పవన్ గెలుపుపై ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.

“ఆద్య, అకీరాలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ తీర్పు వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నాను” అంటూ ఇంట్లో ఆధ్య సంతోషంగా ఉన్న క్షణాలను తన ఇన్ స్టాలో షేర్ చేశారు. ప్రస్తుతం రేణూ దేశాయ్ పోస్ట్ పై నెటిజన్లతోపాటు పవన్ అభిమానులు రియాక్ట్ అవుతున్నారు. పవన్ గెలుపును జనసైనికులు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పటికీ మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ ను విష్ చేయగా.. అటు అల్లు అర్జున్ సైతం శుభాకాంక్షలు తెలిపారు.

“ఈ అద్భుత విజయంపై పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక అభినందనలు. ప్రజలుక సేవ చేయాలని ఎన్నో సంవత్సరాలుగా మీరు చేసిన కృషి, మీ అంకితా భావం, మీ నిబద్ధత ఎప్పటికీ హార్ట్ టచింగ్. ప్రజా సేవలో మీ సరికొత్త ప్రయాణానికి ఆల్ ది బెస్ట్ ” అంటూ బన్నీ పోస్ట్ చేశాడు.

అలాగే న్యాచురల్ స్టార్ నాని కూడా పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్ హీరో అయిన పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు. మిమ్మల్ని ఎంత అనుమానించినా మీరు పోరాటం చేసిన విధానం.. మీరు గెలిచిన తీరు అంతా కేవలం ఒక కథ కాదు. అందరూ నేర్చుకోవాల్సిన పాఠం కూడా. మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది సార్.. భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదగాలని. ప్రతి ఒక్కరికీ రోల్ మోడల్ కావాలని కోరుకుంటున్నారు అంటూ నాని పోస్ట్ చేశారు.


మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.