
రెబల్ స్టార్ ప్రభాస్ గురించి, ఆయన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. పాన్ ఇండియా రేంజ్ లో ప్రభాస్ సినిమాలు విడుదలై అంచనాలు సృష్టిస్తున్నాయి. ఇటీవలే ప్రభాస్ రాజా సాబ్ సినిమాతో పేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కించారు దర్శకుడు. విడుదలకు ముందు ఈ సినిమా పై భారీ బజ్ క్రియేట్ అయ్యింది. ముఖ్యంగా ప్రభాస్ లుక్స్ అభిమానులను తెగ ఆకట్టుకున్నాయి. గత కొన్నేళ్లుగా యాక్షన్ సినిమాలతో మెప్పిస్తున్న ప్రభాస్ ను వింటేజ్ లుక్ తో పాటు ఎంటర్టైన్మెంట్ యాంగిల్ లో చూసి ప్రేక్షకులు ఫుల్ ఖుష్ అయ్యారు.
జనవరి 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా ఈ సినిమా విడుదల తర్వాత మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా మారుతి చెప్పిన రేంజ్ లో సినిమా లేకపోవడంతో అభిమానులు నిరాశపడ్డారు. చాలా మంది ఈ సినిమా పై విమర్శలు కురిపించారు. ఇదిలా ఉంటే ఈ సినిమా కలెక్షన్స్ మాత్రం భారీగానే రాబట్టిందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని డార్లింగ్ అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా ఓటీటీ డీల్ కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
రాజా సాబ్ సినిమా ఓటీటీ డీల్ పూర్తయ్యిందని.. ఓ ప్రముఖ సంస్థ రాజా సాబ్ సినిమా ఓటీటీ రైట్స్ ను భారీ ధరకు కొనుగోలు చేసిందని తెలుస్తుంది. రాజా సాబ్ సినిమా డిజిటల్ హక్కులను రూ. 80 కోట్లకు అమ్మారని తెలుస్తుంది. అన్ని భాషల్లో ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానుందని తెలుస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ రాజా సాబ్ డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. త్వరలోనే రాజా సాబ్ సినిమా ఓటీటీలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి వీడియో సాంగ్స్ ను ఒకొక్కటిగా యూట్యూబ్ లో విడుదల చేస్తున్నారు. ఫిబ్రవరి రెండో వారంలో రాజా సాబ్ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..