The Rajasaab: ‘ది రాజా సాబ్’ ఓటిటి రివ్యూ.. ట్రోల్స్‌కి మేకర్స్ చెక్.. కొత్తగా ఏమేం యాడ్ చేశారంటే..

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ది రాజాసాబ్. మారుతి తెరకెక్కించిన ఈ ఫాంటసీ హారర్ కామెడీ థ్రిల్లర్ సంక్రాంతి కానుకగా జనవరి 09న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజైన ది రాజా సాబ్ మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. సలార్, కల్కి రేంజ్ లో ఈ సినిమా లేదన్న కామెంట్స్ వినిపించాయి.

The Rajasaab: ‘ది రాజా సాబ్’ ఓటిటి రివ్యూ.. ట్రోల్స్‌కి మేకర్స్ చెక్.. కొత్తగా ఏమేం యాడ్ చేశారంటే..
Raja Saab

Edited By:

Updated on: Feb 06, 2026 | 6:38 PM

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన హార్రర్ కామెడీ ఎంటర్టైనర్ రాజా సాబ్ ఓటిటిలోకి ఎంట్రీ ఇచ్చింది. థియేటర్లలో విడుదలైన మొదటి రోజే డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. కేవలం ప్రభాస్ అనే బ్రాండ్ ఇమేజ్, ఆయన స్టార్‌డమ్‌తో బాక్సాఫీస్ వద్ద 200 కోట్ల రూపాయల మార్క్ దాటేసింది. కథలో విషయం ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే.. ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ వల్లే ఆ మాత్రం వసూళ్లు వచ్చాయని అందరికీ తెలుసు. అయితే థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత.. ఇప్పుడు స్మాల్ స్క్రీన్ మీద సినిమా రిలీజ్ అవ్వడంతో అందరి దృష్టి దీనిపై పడింది. ముఖ్యంగా థియేటర్ రిలీజ్ సమయంలో వచ్చిన విపరీతమైన ట్రోలింగ్‌ను దృష్టిలో పెట్టుకుని, ఓటిటి వెర్షన్‌లో మేకర్స్ ఏమైనా మార్పులు చేశారా.? లేక అక్కడ జరిగిన డ్యామేజ్ ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుందా.? అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. సినిమా థియేటర్లలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు.

సినిమాలోని చాలా సన్నివేశాల్లో.. ముఖ్యంగా లాంగ్ షాట్స్ అండ్ ఫైట్ సీక్వెన్స్‌లలో ప్రభాస్ కాకుండా ఆయన బాడీ డబుల్ స్పష్టంగా కనిపిస్తున్నారంటూ నెటిజన్లు ఫోటోలు, వీడియోలతో సహా ట్రోల్ చేశారు. ఒక పక్క స్టార్ హీరో సినిమా అయ్యుండి.. ఇలాంటి ఔట్ పుట్ ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దర్శకుడు మారుతి టేకింగ్ బాగున్నప్పటికీ, విజువల్ క్వాలిటీ విషయంలో.. హీరోని చూపించే విషయంలో శ్రద్ధ తీసుకోలేదనేది అభిమానుల ప్రధాన ఆరోపణ. ఈ నెగిటివ్ టాక్ వల్లే సినిమా అనుకున్న రేంజ్‌లో బ్లాక్ బస్టర్ కాలేకపోయిందనే వాదన కూడా ఉంది. అందుకే ఇప్పుడు ఓటిటి రిలీజ్‌లో ఆ తప్పులను సరిదిద్దేందుకు చిత్ర యూనిట్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా థియేటర్లో రిలీజైన సినిమానే యథాతథంగా ఓటిటిలో వదులుతారు. కానీ రాజా సాబ్ విషయంలో డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ, నిర్మాతలు ఒక అడుగు ముందుకేసి డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేపట్టారు.

ఓటిటి వెర్షన్ కోసం ప్రత్యేకంగా కలర్ గ్రేడింగ్‌లో మార్పులు చేశారు. థియేటర్లో డల్లుగా అనిపించిన కొన్ని ఫ్రేమ్స్‌ని బ్రైట్‌గా మార్చడం, వీఎఫ్ఎక్స్ లోపాలను సరిదిద్దడం అర్థమైపోతుంది. అంతేకాకుండా థియేటర్లో ఎడిటింగ్‌లో లేపేసిన కొన్ని కొత్త సన్నివేశాలను డిజిటల్ వెర్షన్‌లో యాడ్ చేయడం విశేషం. ఈ కొత్త సీన్స్ కథనానికి మరింత బలాన్ని చేకూర్చడమే కాకుండా, సినిమా ఫ్లోని కాస్త పేసీగా మార్చాయి. ట్రోలింగ్‌కు ఆస్కారం ఉన్న కొన్ని షాట్స్‌ను ట్రిమ్ చేయడం.. అలాగే కలర్ కరెక్షన్ ద్వారా కవర్ చేయడం వల్ల సినిమా క్వాలిటీ పెరిగింది. థియేటర్‌లో నెగిటివ్ రివ్యూలు చూసి సినిమాకు వెళ్లని వాళ్లు, ఇప్పుడు ఓటిటిలో చూసి ఆశ్చర్యపోతున్నారు. సినిమా మరీ అంత తీసిపారేసేలా లేదు కదా, బాగానే ఉంది అంటూ పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుండి ఓటిటిలో మంచి స్పందన లభిస్తోంది. మారుతి మార్క్ కామెడీ, హార్రర్ ఎలిమెంట్స్ బాగానే అలరిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

థియేటర్లో ఉండే భారీ అంచనాలు ఓటిటిలో ఉండవు కాబట్టి.. స్మార్ట్ ఫోన్లలో లేదంటే టీవీల్లో చూసేవారికి ఈ సినిమా ఒక మంచి టైమ్ పాస్ ఎంటర్టైనర్‌గా అనిపిస్తోంది. ఈ విషయంలో మేకర్స్ చేసిన మార్పులు ఫలించాయనే చెప్పాలి.. ఎందుకంటే థియేటర్‌లో కనిపించిన ల్యాగ్ ఇక్కడ తగ్గింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, టెక్నాలజీ ఎంత వాడినా.. డేగ కన్నుతో చూసే నెటిజన్ల నుండి తప్పించుకోవడం మాత్రం కష్టమే. సినిమా బాగుందనే టాక్ వస్తున్నప్పటికీ.. కొన్ని కీలకమైన సన్నివేశాల్లో ప్రభాస్ డూప్ వాడకం ఇంకా స్పష్టంగా తెలుస్తోందని విమర్శకుల వాదన. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్‌తో పాటు కొన్ని డాన్స్ బిట్స్‌లో ఫేస్ సరిగ్గా కనిపించకపోవడం.. బాడీ లాంగ్వేజ్ మారడం వంటివి ప్రేక్షకులు గుర్తిస్తున్నారు. కలర్ గ్రేడింగ్ మార్చారు సరే.. కానీ తీసిన షాట్‌ని మార్చలేరు కదా అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఏదేమైనా థియేటర్లో వచ్చిన నెగిటివిటీతో పోలిస్తే, రాజా సాబ్ ఓటిటి జర్నీ కాస్త సాఫీగానే సాగుతోంది. చిన్న చిన్న లోపాలను పక్కన పెడితే.. డిజిటల్ బయటపడేలాగే ఉంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..