ఇటీవల ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు మాస్ మాహారాజా రవితేజ. ఈ మూవీ తర్వాత వచ్చిన వాల్తేరు వీరయ్య సైతం సూపర్ హిట్ అందుకుంది. దీంతో బ్యాక్ టూ బ్యాక్ భారీ విజయాలను అందుకుని ఫుల్ జోష్లో ఉన్నారు మాస్ మాహారాజా. ప్రస్తుతం ఆయన చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో రావణాసుర ఒకటి. ఇందులో ఏకంగా ఆరుగురు హీరోయిన్స్ నటిస్తున్నారు. డైరెక్టర్ సుధీర్ వర్మ తెరకెక్కిస్తోన్న ఈ సినిమపై ఇప్పటికే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గత కొద్ది రోజులుగా సినిమా చిత్రీకరణ కంప్లీట్ చేసే పనిలో ఉన్నా మేకర్స్.. ఇప్పుడు మూవీ ప్రమోషన్స్ పై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ రివీల్ చేస్తూ.. మాస్ ఆడియన్స్ ను ఆట్రాక్ట్ చేస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ షేర్ చేశారు రవితేజ. ఇప్పటికే టీజర్ తో అంచనాలను పెంచేసిన మేకర్స్.. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. మార్చి 28న సాయంత్రం 4.5 నిమిషాలకు రావణాసుర ట్రైలర్ తో బ్లాస్టింగ్ ట్రీట్ ఇవ్వనున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. రవితేజపై ఓ ఇంటెన్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.
ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సంగీతం అందిస్తుండగా.. అభిషేక్ పిక్చర్స్, రవితేజ టీం వర్స్క్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో దక్షా నగార్కర్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, అను ఇమన్యూయేల్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరోవైపు టైగర్ నాగేశ్వర రావు సినిమా చేస్తున్నారు రవితేజ.
The fireworks will begin in advance for you all ?#RavanasuraTrailer on 28th March at 4:05 PM ?#Ravanasura#RavanasuraOnApril7 pic.twitter.com/lE0DFISvUD
— Ravi Teja (@RaviTeja_offl) March 25, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.