
మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇరుముడి’. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం గ్లింప్స్, ట్రైలర్, పాటలతో ఇప్పటికే భారీ అంచనాలు రేకెత్తించింది. ఆగస్టు 21న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఎమోషన్స్, యాక్షన్‌తో కూడిన డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతుంది. ఈ సందర్భంగా దర్శకుడు శివ నిర్వాణ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. అలాగే ఈ సినిమా గురించి వస్తున్న కొన్ని రూమర్స్ పై ఆయన క్లారిటీ ఇచ్చారు.
అదే ఇరుముడి సినిమాలో రామ్ చరణ్ గెస్ట్ రోల్ చేస్తారని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ రూమర్స్ పై దర్శకుడు నిర్వాణ క్లారిటీ ఇస్తూ.. లేదండి. అది సోషల్ మీడియా ప్రచారం మాత్రమే. రామ్ చరణ్ గారు అయ్యప్ప భక్తులు. ఆయనకు ఆ వైబ్ వుంటుంది. బహుశా అభిమానులు అలా కోరుకున్నారేమో. కానీ ఇందులో చరణ్ గారు కనిపిస్తారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. ఈ సినిమా రామ్ చరణ్ గారికి నచ్చాలని కోరుకుంటున్నా అని అన్నారు దర్శకుడు శివ.
ఇరుముడి ప్రమోషనల్ కంటెంట్ గురించి శివ మాట్లాడుతూ.. ఈ సినిమాలో మొత్తం మూడు లేయర్స్ ఉంటాయి. ఒకటి అయ్యప్ప స్వామి మాల నేపథ్యం, అలాగే ఫ్యామిలీ, మరొకటి క్రైమ్ యాంగిల్. ప్రమోషన్స్ కూడా ఆ కంటెంట్‌కు తగ్గట్టే ప్లాన్ చేసుకున్నాను. ఆ ప్లాన్ ప్రకారం ఈ సినిమాకు సంబంధించి ప్రతి ఒక్క విషయాన్ని రివీల్ చేసుకుంటూ వచ్చాము. ట్రైలర్ దగ్గరికి వచ్చేసరికి సినిమాలో ఏముందనేది ఇప్పుడు అందరికీ క్లారిటీ వచ్చింది. ప్రతి ఒక్కరూ సినిమాలో ఏముందో చూడడానికి ప్రిపేర్‌గా ఉన్నారు. ఆ అంచనాలను సినిమా ఖచ్చితంగా అందుకుంటుంది. ఎప్పుడైనా ఎవరూ టచ్ చేయని పాయింట్ చెప్తున్నప్పుడు ఒక యాక్టర్ చేస్తే ఒకలా ఉంటుంది. అదే స్టార్ చేస్తే దాని రీచ్ మరోలా ఉంటుంది. అయ్యప్ప స్వామిమాల నేపథ్యం, అందులో ఫ్యామిలీ, అలాగే కొత్త సెటప్. ఇలాంటి కథని రవితేజ గారి లాంటి స్టార్ హీరోతో చేసినప్పుడు ఆ కథ ప్రతి ఇంటికి చేరుతుంది అని శివ నిర్వాణ చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి :
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.