Ramarao On Duty: మాస్ మహారాజా అభిమానులకు గుడ్‏న్యూస్.. రామారావు ఆన్ డ్యూటీ సినిమా రిలీజ్ ఎప్పుడంటే..

|

Mar 23, 2022 | 3:46 PM

మాస్ మహారాజా రవితేజ (Raviteja) ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం రామారావు ఆన్ డ్యూటీ (Ramarao On Duty).

Ramarao On Duty: మాస్ మహారాజా అభిమానులకు గుడ్‏న్యూస్.. రామారావు ఆన్ డ్యూటీ సినిమా రిలీజ్ ఎప్పుడంటే..
Ramarao On Duty
Follow us on

మాస్ మహారాజా రవితేజ (Raviteja) ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం రామారావు ఆన్ డ్యూటీ (Ramarao On Duty). ఈ సినిమాకు శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించగా.. హీరో వేణు తొట్టెంపూడి రీఎంట్రీతో ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతోన్న యునీక్ యాక్షన్ థ్రిల్లర్ ఈ మూవీ ప్రస్తుతం మొత్తం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. శరత్ మండవ దర్శకునిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని SLV సినిమాస్ LLP, RT టీమ్ వర్క్స్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా మేకర్స్ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. రామారావు ఆన్ డ్యూటీ జూన్ 17న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ రోజు మేకర్స్ రవితేజ తీక్షణంగా చూస్తోన్న లుక్‏ను విడుదల చేశారు. ఇందులో కొన్ని భారీ రవాణా వాహనాలు అడవి గుండా వెళుతుండడాన్ని ఆయన గమనిస్తున్నారు. ఈ పోస్టర్ ఆసక్తిని క్రియేట్ చేయడమేకాకుండా, సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఇటీవల విడుదల చేసిన టీజర్ సినిమాపై మరింత అంచనాలను పెంచింది. రాబోయే రోజుల్లో మరింత హైప్ క్రియేట్ చేసేలా మేకర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్లతో రాబోతున్నారు. సామ్ సిఎస్ బ్యాక్ గ్రౌండ్ సంగీతంతోపాటు బాణీలు మరింత ఆకట్టుకోనున్నాయి. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని సత్యన్ సూర్యన్ ISC నిర్వహిస్తుండగా, ప్రవీణ్ కెఎల్ ఎడిటర్. ఇందులో నాజర్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, ‘సర్పట్ట’ జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, రాహుల్ రామ కృష్ణ, ఈరోజుల్లో శ్రీ, మధు సూదన్ రావు, సురేఖ వాణి తదితరులు కీలకపాత్రలలో నటిస్తున్నారు.

Also Read: Ram Gopal Varma : బాలీవుడ్‌ను తన స్టైల్‌లో కడిగిపారేసిన ఆర్జీవీ.. కాశ్మీర్ ఫైల్స్ పై వర్మ కామెంట్స్

Avatar 2 : అవతార్ 2 ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. విజువల్ ట్రీట్ ట్రైలర్ రిలీజ్ అయ్యేది అప్పుడేనా..?

Harish Shankar: బంపర్ ఆఫర్ అందుకున్న హరీష్ శంకర్.. మెగాస్టార్‌తో ఆ మూవీ రీమేక్

RRR Movie: రేటు ఎంతయినా తగ్గేదే లే.. ఆర్ఆర్ఆర్ టికెట్ల కోసం పోటీపడుతున్న ఫ్యాన్స్ .