
Raviteja: రీరిలీజ్ కాబోతున్న రవితేజ, పూరీ డిజాస్టర్ మూవీ.. మళ్లీ థియేటర్లలోకి ‘నేనింతే’..కొన్నాళ్లుగా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలు రీరిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మురారి సినిమాను మళ్లీ విడుదల చేయగా ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన డిజాస్టర్ మూవీ నేనింతే చిత్రాన్ని రీరిలీజ్ చేయనున్నారు. దాదాపు పదిహేనేళ్ల తర్వాత ఈ సినిమా మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఆగస్ట్ నెల చివర్లో లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో ఈ సినిమాను మరోసారి విడుదల చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సినిమాల్లో అవకాశాలను వెతుక్కుంటూ వచ్చినవారి జీవితం, కృష్ణానగర్ కష్టాలను కళ్లకు కట్టినట్లుగా చూపించారు డైరెక్టర్ పూరి జగన్నాథ్.
దర్శకులు, నటీనటులు కావాలనే ఆశతో కృష్ణానగర్ లో అడుగుపెట్టిన వారి జీవితాలు ఎలా ఉంటాయి. ? ఇండస్ట్రీలో సక్సెస్ కావడం వెనుకవారు పడే వ్యథలు, బాధలను ఈ చిత్రంలో చూపించారు. అలాగే ఈ సినిమాలోని డైలాగ్స్, పాటలతోపాటు రవితేజ నటనపై ప్రశంసలు వచ్చాయి. విమర్శకుల ప్రశంసలతోపాటు ఎన్నో అవార్డులను అందుకున్న ఈ సినిమా కమర్షియల్ గా మాత్రం ఫెయిల్యూర్ అయ్యింది. ఈ సినిమాలో దర్శకుడు కావాలనే తపించే రవి అనే యువకుడి పాత్రలో అద్భుతమైన నటనతో మెప్పించాడు రవితేజ. చాలా సంవత్సరాు అసిస్టెంట్ గా దర్శకుడిగా పనిచేసిన రవికి ఎలా సినిమా అవకాశం వచ్చింది.. దర్శకుడిగా స్క్రీన్ పై పేరు చూసుకోవాలని కలలు కన్న రవికి యాదు అనే రౌడీ ఎలాంటి షాకిచ్చాడు అనేది సినిమా.
ఈ సినిమాలో రవితేజ సరసన శియా గౌతమ్ కథానాయికగా నటించింది. అలాగే ఇందులో బ్రహ్మానందం, వేణుమాధవ్, సుప్రీత్, సుబ్బరాజు కీలకపాత్రలలో నటించారు. ఈ సినిమాలో డైరెక్టర్స్ హరీష్ శంకర్, వివి వినాయక్ తోపాటు మ్యూజిక్ డైరెక్టర్ చక్రి, రైటర్ కోన వెంకట్ అతిథి పాత్రలలో నటించారు. ఈ సినిమా కమర్షియల్ హిట్ కాకపోయినా.. డైరెక్టర్ పూరి మేకింగ్, రవితేజ యాక్టింగ్ కట్టిపడేసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.