Manchu Manoj: నా హృదయాన్ని ముక్కలు చేసింది.. వారిని గుర్తించడంలో ఫెయిల్ అయ్యాం.. మంచు మనోజ్..
ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తుతుండగా... మరోవైపు కొందరు ఆకతాయిలు మాత్రం సదరు బాధితురాలిని ఉద్దేశించి చెప్పుకోలేని విధంగా అసభ్యకర రీతిలో పోస్టులు పెడుతున్నారు. బాధితురాలి ఫోటోస్ షేర్ చేస్తూ అసభ్యకరంగా పోస్టులు పెడుతున్న వారి గురించి టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ట్వీట్ చేశాడు.

కోల్ కత్తాలో ట్రైనీ డాక్టర్ పై జరిగిన దారుణం గురించి ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతుంది. హత్యాచారం జరిగిన డాక్టర్ కు న్యాయం జరగాలని.. నింధితులను వెంటనే శిక్షించాలని ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులలో డాక్టర్స్ నిరసన వ్యక్తం చేయగా.. అటు సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు సైతం ఆమెకు న్యాయం జరగాలని కోరుతున్నారు. అయితే ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తుతుండగా… మరోవైపు కొందరు ఆకతాయిలు మాత్రం సదరు బాధితురాలిని ఉద్దేశించి చెప్పుకోలేని విధంగా అసభ్యకర రీతిలో పోస్టులు పెడుతున్నారు. బాధితురాలి ఫోటోస్ షేర్ చేస్తూ అసభ్యకరంగా పోస్టులు పెడుతున్న వారి గురించి టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ట్వీట్ చేశాడు. సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
“జన్మనిచ్చిన మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలమవ్వడం నా హృదయాన్ని ముక్కలు చేసింది. అలాగే స్క్రీన్ వెనక ఉండి దారుణమైన పోస్టులు చేస్తున్న వ్యక్తులను గుర్తించి వారిని శిక్షించడంలోనూ ఫెయిల్ అయ్యాం. కోల్ కత్తా ఘటనలో బాధితురాలిని ఉద్ధేశించి అసభ్యకర పోస్టులు చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలి. ఇలాంటి సంస్కృతిని నార్మలైజ్ చేయకుండా జవాబుదారీగా నిలబడాలని కోరుతున్నాను ” అంటూ మంచు మనోజ్ ట్వీట్ చేశారు.
ఇప్పటికే కోల్ కత్తా ఘటనపై టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్ రియాక్ట్ అయ్యారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ట్వీట్స్ చేశారు. కోల్ కత్తాలోని ఆర్జీ కర్ ఆసుపత్రిలో రాత్రిపూట విధుల్లో ఉన్న 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ పై ఆత్యాచారం చేసి, ఆపై హత్య చేశారు. ఈ ఘటన తెల్లవారుజామున జరిగింది. యువతి శరీరంపై దాడి చేసిన గుర్తులు ఉండడంతో హత్యాచారం జరిగినట్లు పోస్టుమార్టం రిపోర్టులో బయటపడింది.

Manchu Manoj
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




