Actress Sitara: 51 ఏళ్ల వయసులోనూ ఒంటరిగా.. ఈ నటి పెళ్లి చేసుకోకపోవడానికి కారణమేంటో తెలుసా..?
1986లో మలయాళ చిత్రం 'కావేరి'తో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఫస్ట్ మూవీతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సితారకు మిగతా భాషలలోనూ అనేక ఆఫర్స్ వచ్చాయి. 1980-90లలో అత్యంత బిజీ ఆర్టిస్టులలో ఒకరిగా మారింది. సితార వయసు ప్రస్తుతం 51 ఏళ్లు. సినిమాల్లో అద్భుతమైన నటనతో మెప్పించిన సితార.. ఇప్పటికీ ఒంటరిగానే ఉంటుంది.

దక్షిణాది చిత్రపరిశ్రమలో ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడే నటీమణులలో సితార ఒకరు. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో ఎన్నో వందల చిత్రాల్లో నటించింది. కెరీర్ ప్రారంభంలో కథానాయికగా అలరించిన సితార.. ఆ తర్వాత తల్లిగా, అత్తగా, వదినగా ఇలా ఎన్నో సినిమాల్లో సహాయ పాత్రలలో నటించి మెప్పించింది. 1986లో మలయాళ చిత్రం ‘కావేరి’తో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఫస్ట్ మూవీతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సితారకు మిగతా భాషలలోనూ అనేక ఆఫర్స్ వచ్చాయి. 1980-90లలో అత్యంత బిజీ ఆర్టిస్టులలో ఒకరిగా మారింది. సితార వయసు ప్రస్తుతం 51 ఏళ్లు. సినిమాల్లో అద్భుతమైన నటనతో మెప్పించిన సితార.. ఇప్పటికీ ఒంటరిగానే ఉంటుంది. 51 ఏళ్లు పూర్తి చేసుకున్నప్పటికీ ఈ నటి ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. అనేక టీవీ ప్రోగ్రామ్‌లలో తన పెళ్ళి గురించి ప్రశ్నలు తలెత్తినప్పటికీ, ఆమె ఒంటరిగా ఉండటానికి కారణాన్ని స్పష్టం చేయలేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో నటి తన నిర్ణయాన్ని బయటపెట్టింది. తనకు చాలా పెళ్లి ప్రపోజల్స్ వచ్చినా తన తల్లిదండ్రుల కారణంగా పెళ్లి గురించి ఆలోచించలేదని వెల్లడించింది.
సితార తల్లిదండ్రులు వైద్యుల బోర్డులో అధికారులుగా వర్క్ చేస్తున్నారు. ‘‘పెళ్లయ్యాక నాన్న, అమ్మను వదిలి ఎక్కడో దూరంగా బతకాల్సి వస్తుందని అనుకున్నాను. ఆ తర్వాత నాన్న చనిపోయాక పెళ్లి ఆలోచనే పూర్తిగా దూరమయ్యింది. ఈ ఒంటరి జీవితంలో నేను సంతోషంగా ఉన్నాను, బిజీ వర్క్ వల్ల ఒంటరిగా ఉన్నాననే ఫీలింగ్ కలగలేదు ” అంటూ చెప్పుకొచ్చింది.
మూడు దశాబ్దాలకు పైగా సినీరంగంలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పటివరకు 100కు పైగా చిత్రాల్లో నటించింది. అటు బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా అనేక చిత్రాల్లో నటించింది.. 2015లో వచ్చిన ‘సైగల్ పటుకుక్’ సినిమా తర్వాత ఈ నటి మలయాళ సినిమా నుండి విరామం తీసుకుంది.. ఈ నటి ఇప్పటికీ తమిళం, తెలుగు భాషలలో చురుకుగా ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




