Tollywood: ఏంటీ.. ఈ బ్యూటీ నేనింతే హీరోయినా..? నెట్టింట గ్లామర్ రచ్చ చేస్తోన్న బ్యుటీ.. ఫోటోస్ చూస్తే..

తెలుగు సినీరంగంలో ఒక్క సినిమాతోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. కానీ ఆ తర్వాత అంతగా అవకాశాలు మాత్రం అందుకోలేదు. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుందా.. ? తనే నేనింతే మూవీ హీరోయిన్. రవితేజ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ రవితేజ మరోసారి ప్రశంసలు అందుకున్నారు.

Tollywood: ఏంటీ.. ఈ బ్యూటీ నేనింతే హీరోయినా..? నెట్టింట గ్లామర్ రచ్చ చేస్తోన్న బ్యుటీ.. ఫోటోస్ చూస్తే..
Neninthe

Updated on: May 25, 2025 | 3:33 PM

డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అందులో నేనింతే ఒకరు. మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ 2008లో విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ అంతగా కమర్షియల్ హిట్ కాలేదు. ఈ సినిమా స్టోరీ, రవితేజ డైలాగ్స్, సాంగ్స్ అప్పట్లో యూత్ ను తెగ ఆకట్టుకున్నాయి. ఇందులో రవితేజ సరసన హీరోయిన్ శియా గౌతమ్ కథానాయికగా నటించింది. ఈ ముద్దుగుమ్మకు తొలి సినిమా అయినప్పటికీ అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో ఆమెకు తెలుగులో మరిన్ని ఆఫర్స్ వస్తాయనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఈ బ్యూటీకి ఆఫర్స్ మాత్రం రాలేదు.

తొలి చిత్రంతోనే మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. శియా గౌతమ్ అసలు అదితి గౌతమ్. మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత తన పేరును మార్చుకుంది. పూరి, రవితేజ కాంబోలో వచ్చిన నేనింతే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా తర్వాత అవకాశాలు రాలేదు. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది. హిందీలోనూ పలు సినిమాల్లో నటించింది. రణబీర్ కపూర్ నటించిన సంజూ చిత్రంలో నటించింది. ఈ సినిమా సైతం బాక్సాఫీస్ వద్ద ప్లాప్ కావడంతో అక్కడ కూడా నిరాశే ఎదురైంది.

సినిమాలకు దూరంగా ఉన్న శియా గౌతమ్.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. అప్పటికీ, ఇప్పటికీ ఏమాత్రం మారకుండా గ్లామర్ స్టన్నింగ్ లుక్స్ తో ఆశ్చర్యపరుస్తుంది.

ఇవి కూడా చదవండి :  

Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..

Megastar Chiranjeevi: అమ్మ బాబోయ్.. చిరంజీవి ఆపద్బాంధవుడు హీరోయిన్‏ గుర్తుందా..? ఇప్పుడు చూస్తే స్టన్ అవ్వాల్సిందే..

OTT Movie: బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ.. 3 కోట్లతో తీస్తే రూ.70 కోట్ల కలెక్షన్స్.. 2 గంటలు నాన్‏స్టాప్ సస్పెన్స్..

Actress: ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్..