మాస్ మాహారాజా రవితేజ (Raviteja) ప్రస్తుతం నటిస్తోన్న చిత్రాలలో రామారావు ఆన్ డ్యూటీ మూవీ ఒకటి. డైరెక్టర్ శరత్ మండవ తెరకెక్కిస్తో్న్న ఈ సినిమాలో దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు. చాలా కాలం తర్వాత అలనాటి హీరో వేణు తొట్టెంపూడి ఈ మూవీతో రీఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ మురళిగా వేణు కనిపించనున్నట్లు ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో తెలియజేశారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, వీడియోస్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేయగా.. సాంగ్స్ నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్‌కు సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. అందులో ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ చూపించారు. యాక్షన్ థ్రిల్లర్ గా రవితేజ అభిమానులను సినీ ప్రియులను ఆకట్టుకునే విధంగా ఆ వీడియోను కట్ చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని జూలై 29న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక ఈమూవీ ట్రైలర్ ను జూలై 16న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్. ఈ సినిమా ఆర్టీ టీమ్ వర్క్స్ తో కలిసి ఎస్ఎల్వీ సినిమాస్ నిర్మిస్తుండగా.. సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు.
వీడియో..
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.