Ravi Teja: వెంకీ మిస్ చేసుకున్న సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రవితేజ.. ఏ మూవీ అంటే..

డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అంతేకాకుండా ఈ సినిమాతో మరోసారి ఫాంలోకి వచ్చేశారు రవితేజ. ఇందులో ఆయన పోలీస్ ఆఫీస్ గా నటించగా.. శ్రుతి హాసన్ కథానాయికగా కనిపించింది. బలమైన కథాకథనాలు, డిఫరెంట్ గా డిజైన్ చేయబడిన ఫైట్స్ ఈ సినిమాకు హైలెట్ అయ్యాయి. అంతేకాకుండా.. రవితేజ కెరియర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమా ఇది కావడం విశేషం.

Ravi Teja: వెంకీ మిస్ చేసుకున్న సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రవితేజ.. ఏ మూవీ అంటే..
Venkatesh, Raviteja
Follow us

|

Updated on: May 17, 2023 | 11:28 AM

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న హీరో రవితేజ. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి మాస్ మహారాజాగా తనకంటూ క్రేజ్ సంపాదించుకున్నారు. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన నటించిన ఇడియట్ సినిమాతో స్టార్ డమ్ వచ్చేసింది. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఫుల్ జోష్ మీదున్న రవితేజ.. మధ్యలో వరుస డిజాస్టర్స్ ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. వరుస ప్లాపులతో సతమతమవుతున్న మాస్ మాహారాజాకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన సినిమా క్రాక్. డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అంతేకాకుండా ఈ సినిమాతో మరోసారి ఫాంలోకి వచ్చేశారు రవితేజ. ఇందులో ఆయన పోలీస్ ఆఫీస్ గా నటించగా.. శ్రుతి హాసన్ కథానాయికగా కనిపించింది. బలమైన కథాకథనాలు, డిఫరెంట్ గా డిజైన్ చేయబడిన ఫైట్స్ ఈ సినిమాకు హైలెట్ అయ్యాయి. అంతేకాకుండా.. రవితేజ కెరియర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమా ఇది కావడం విశేషం.

అయితే ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతుంది. వాస్తవానికి ఈ సినిమాను ముందుగా చేయాల్సింది వెంకటేశ్ అంట. గతంలో వెంకీతో గోపిచంద్ మలినేని బాడీగార్డ్ సినిమాను చేశాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఉంది. అందువలన క్రాక్ కథను ముందుగా ఆయన వెంకీకి వినిపించారట. అయితే ఆ సమయంలో తనకు ఉన్న కమిట్మెంట్స్ కారణంగా ఈ సినిమాను వదిలేసుకున్నారట వెంకీ.

ఇవి కూడా చదవండి

ఇక వెంకీ అందుబాటులో లేకపోవడంతో.. వెంటనే గోపిచంద్ మలినేని.. ఆ కథను రవితేజకు వినిపించాడట. అప్పటికే ఇద్దరి కాంబోలో వచ్చిన డాన్ శీను, బలుపు సినిమాలు హిట్ కావడంతో మరో ప్రాజెక్ట్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట మాస్ మాహారాజా. అలా రవితేజ ఒప్పుకోవడం వలన ఇద్దరికీ ఈ సినిమాతో మరో హ్యాట్రిక్ హిట్ పడింది. ప్రస్తుతం రవితేజ టైగర్ నాగేశ్వర రావు సినిమాలో నటిస్తున్నారు.