Anand Devarakonda: రష్మికను ఆనంద్ దేవరకొండ ఏమని పిలుస్తాడో తెలుసా ?.. వైరలవుతున్న పోస్ట్..
ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలిపారు. ఇక తన తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. రేర్ ఫోటో షేర్ చేశాడు విజయ్. ఏదైనా గొడవ జరిగితే నాతో పాటు ఫస్ట్ తీసుకుపోయే అబ్బాయికి జన్మదిన శుభాకాంక్షలు.. హ్యాపీ బర్త్ డే ఆనంద్ దేవరకొండ.. లవ్ యూ అంటూ తమ్ముడిపై ప్రేమను బయటపెట్టాడు విజయ్..

ఇటీవలే బేబీ సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు ఆనంద్ దేవరకొండ. రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఇప్పుడు తనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అతి తక్కువ సమయంలోనే కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. బేబీ సినిమాతో ఆనంద్కు మరింత క్రేజ్ వచ్చింది. నిన్న (మార్చి 15న) ఆనంద్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలిపారు. ఇక తన తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. రేర్ ఫోటో షేర్ చేశాడు విజయ్. ఏదైనా గొడవ జరిగితే నాతో పాటు ఫస్ట్ తీసుకుపోయే అబ్బాయికి జన్మదిన శుభాకాంక్షలు.. హ్యాపీ బర్త్ డే ఆనంద్ దేవరకొండ.. లవ్ యూ అంటూ తమ్ముడిపై ప్రేమను బయటపెట్టాడు విజయ్..
ఇక ఆనంద్ దేవరకొండకు నేషనల్ క్రష్ రష్మిక మందన్న విషెస్ తెలిపారు. తన ఇన్ స్టా స్టోరీలో ఆనంద్ క్రేజీ ఫోటోను షేర్ చేస్తూ హ్యాపీ బర్త్ డే ఆనందా అంటూ పోస్ట్ చేసింది. ఇక రష్మిక పోస్ట్ కు రిప్లై ఇస్తూ తన స్టోరీలో థాంక్యూ రషీ.. కానీ ఈ వరస్ట్ ఫోటో ఎందుకు పెట్టావు అంటూ సరదాగా అన్నాడు. దీనికి రష్మిక రిప్లై ఇస్తూ.. అందుకే నేను అడిగినప్పుడు మంచిగా పోజ్ ఇవ్వమనేది అంటూ ఫన్నీగా పోస్ట్ చేసింది. ప్రస్తుతం వీరిద్దరి ఇన్ స్టా స్టోరీ ముచ్చట్లు సోషల్ మీడియాలో వైరలవుతున్నారు. ఇద్దరూ ఎంతో క్లోజ్ గా సరదాగా మాట్లాడుకోవడం చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. అలాగే రష్మికను ఆనంద్ దేవరకొండ రషీ అని పిలుస్తాడా ?.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

Rashmika, Anand
గతంలోనూ వీరిద్దరు ఒకరి గురించి ఒకరు సరదాగా పోస్టులు షేర్ చేశారు. దీంతో విజయ్ కుటుంబంతో రష్మికకు మంచి అనుబంధం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. విజయ్ దేవరకొండ, రష్మిక ప్రేమలో ఉన్నారంటూ కొన్నాళ్లుగా ప్రచారం నడుస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు తమ ఇన్ స్టాలో షేర్ చేసే ఫోటోస్ ఒకేలా ఉండడంతో ఈ రూమర్స్ కు మరింత బలం చేకూరింది. అయితే ఈ రూమర్స్ పై వీరిద్దరు ఇంతవరకు స్పందించలేదు. ప్రస్తుతం రష్మిక పుష్ప 2లో నటిస్తుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




