Rashmika Mandanna: సుకుమార్ ను కాకా పడుతున్న లక్కీబ్యూటీ.. రష్మిక సీన్స్ ను ముందే షూట్ చేయనున్నారట…
లోకల్ స్టార టూ పాన్ ఇండియా స్టార్ గా మారాలని చూస్తున్న రష్మిక మందన్న ఓ మాస్టర్ ప్లాన్ ను రెడీ చేశారు. మల్లువుడ్ కాకుండా రిమెయినింగ్ సౌత్ ఉడ్‌లన్నింటిలో యాక్ట్ చేసిన ఈ బ్యూటీ...

Rashmika Mandanna: లోకల్ స్టార టూ పాన్ ఇండియా స్టార్ గా మారాలని చూస్తున్న రష్మిక మందన్న ఓ మాస్టర్ ప్లాన్ ను రెడీ చేశారు. మల్లువుడ్ కాకుండా రిమైనింగ్ సౌత్ ఉడ్‌లన్నింటిలో యాక్ట్ చేసిన ఈ బ్యూటీ…ఇప్పుడు బాలీవుడ్ కలలతో తెగ ఖుషీ అవుతున్నారు. బాలీవుడ్లో తొందరగా క్రేజీ హీరోయిన్‌గా మారలని ట్రై కూడా చేస్తున్నారు. అందుకు తగ్గట్టే ఇక్కడి సినిమా డేట్లు.. అక్కడి సినిమా డేట్లు క్లాష్ కాకుండా కసరత్తులు చేస్తున్నారు. కన్నింగ్గా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రజెంట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన “పుష్ప” లో నటిస్తున్న రష్మిక … ఈ మూవీ కోసం ఏకంగా బల్కీ డేట్స్‌ను ఇచ్చేశారట. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గడం.. టాలీవుడ్‌లోని మేకర్స్ అందరూ తమ సినిమా షూటింగ్‌లను స్టార్ట్ చేస్తుండడంతో… డైరెక్టర్ సుకుమార్ కూడా పుష్ప షెడ్యూల్ కురీసెంట్గా ప్లాన్ చేశారట. అందులో భాగంగానే జూలై ఫస్ట్ వీక్ నుంచి మళ్లీ సెట్‌లో అందరూ హాజరు కావాలని ఆర్డర్ వేశారట కూడా..! అయితే ప్రస్తుతం బాలీవుడ్ కలలతో బిజీగా ఉన్న రష్మిక ఈ సినిమా కోసం డైరెక్టర్ అడగకుండానే వరుసగా 30 రోజులను ఇచ్చేశారట. “నా సీన్లను కొంచె తొందరగా షూట్ చేయరూ…. మీకర్థం అవుతుందా” అంటూ చాలా సుకుమారంగా డైరెక్టర్ సుకుమార్ ను అడిగేశారట.
అంత క్యూట్ గా ఈ బ్యూటీ అడగడంతో “ఎందుకూ” అని అడగని సుకుమార్ అందుకు తగ్గట్టే ఈ బ్యూటీతో ఉన్న సీన్లను ముందే షూట్ చేసేందుకు తన ప్లాన్‌ను మార్చారట.ఆ ప్లాన్ లో భాగంగానే.. గోవాలోని అందమైన లొకేషన్లలో పుష్పరాజ్‌తో ఓ డ్యూయట్‌ను చిత్రీకరించనున్నారట సుకుమార్. ఇక ఈ సాంగ్ పూర్తి అవగానే కొద్ది రోజులు రష్మికను రిలీవ్ చేసి… ఆల్ ది బెస్ట్ టూ యువర్ బాలీ డ్రీమ్స్ అంటూ చెప్పనున్నారట డైరెక్టర్ సుకుమార్. ఇప్పుడిదే విషయం అటు ఇండస్ట్రీలోనూ… ఇటు సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది.
మరిన్ని ఇక్కడ చదవండి :
