Ram Pothineni: మరోసారి మాస్ ఆడియన్స్ ను అలరించడానికి రామ్ సిద్ధం అవుతున్నారా…?.

ఓ తమిళ డైరెక్టర్‌ చెప్పిన స్టోరీకి ఫిదా అయిపోయారు హీరో రామ్‌ పోతినేని . ఆ ఎక్జ్సైట్‌ మెంట్‌లో తట్టుకోలేక లవ్‌ యూ సర్‌ అంటూ డైరెక్టర్‌కు ట్వీట్‌ కూడా చేశారు.

Ram Pothineni: మరోసారి మాస్ ఆడియన్స్ ను అలరించడానికి రామ్ సిద్ధం అవుతున్నారా...?.
Rajeev Rayala

|

Jun 28, 2021 | 8:26 PM

ram pothineni: ఓ తమిళ డైరెక్టర్‌ చెప్పిన స్టోరీకి ఫిదా అయిపోయారు హీరో రామ్‌ పోతినేని . ఆ ఎక్జ్సైట్‌ మెంట్‌లో తట్టుకోలేక లవ్‌ యూ సర్‌ అంటూ డైరెక్టర్‌కు ట్వీట్‌ కూడా చేశారు. అంతేకాదు రోల్ దట్ కెమెరా అంటూ తనే ముందే చెప్పేస్తున్నారు. ఇంతకీ రాపోను అంతలా ఫిదా చేసిన ఆ డైరెక్టర్‌ ఎవరో మీకు కూడా తెలుసుకోవాలని ఉంది కదూ..! ఎనర్జీటిక్ హీరో రామ్ ప్రస్తుతం తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. సెకండ్ వేవ్ లాక్‌డౌన్‌ ముందు ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేశారు కూడా… చేశారు. అయితే ఇటీవల విడుదలైన రెడ్ సినిమా ఆశించినంత హిట్ కాకపోవడంతో.. రామ్ తన తదుపరి ప్రాజెక్ట్స్ పట్ల కాస్త జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా ఇండస్ట్రీలో టాక్‌. అందులో భాగంగా  లింగుస్వామితో సినిమా చేసేందుకు రెడీ అయిపోయారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమా గురించి తాజాగా రామ్ ఓ ట్వీట్ చేశారు. ఇప్పుడా ట్వీట్‌ షూటింగ్‌ మొదలు కాకాముందే సినిమాపై విపరీతంగా అంచనాలను పెంచుతుంది.

“ఫైనల్ నరేషన్ పూర్తైంది. కథ సూపర్ డూపర్ కిక్ ఇచ్చింది. లవ్ యూ లింగుస్వామి సార్, ఇక షూటింగ్ మొదలు పెడదాం” అంటూ ట్వీట్ చేశారు రామ్. ఇక ఈ ఎనర్జీటిక్ స్టార్ చేసిన ట్వీట్ చూస్తుంటే.. వీరిద్దరిక కాంబోలో వచ్చే సినిమా ఓ రేంజ్ లో ఉండబోతుందని మనకు కూడా అనిపిస్తుంది కదూ.. మనకే కాదు రామ్‌ ట్వీట్ చూసిన అందరికీ ఇదే అనిపిస్తుంది. ఇక యాక్షన్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో రామ్‌కి జోడీగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ కూడా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అభిమానులంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. గతంలో రామ్ చేసిన ఇస్మార్ట్ శంకర్ ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ కు తెగ నచ్చేసింది ఈ సినిమా. అలాగే ఆతర్వాత వచ్చిన రెడ్ సినిమాలోనూ మాస్ యాక్టింగ్ తో అలరించాడు రామ్. ఇప్పుడు ఈ సినిమాలోకూడా ఆడియన్స్ కు కావాల్సినంత మాస్ ఉంటుందని అంటున్నారు. అలాగే లింగు స్వామి గత చిత్రాల మాదిరిగానే భారీ యాక్షన్స్ సీక్వెన్స్ కూడా ఉంటాయని తెలుస్తుంది. రామ్ అభిమానులంతా మరో ఇస్మార్ట్ శంకర్ అవుతుందని అంటున్నారు. చుడాలిమరి లింగు స్వామి ఎలాంటి కథను సిద్ధం చేసారో.అలాగే ఈ  సినిమాకు ఉస్తాద్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఫైనల్‌ స్క్రిప్ట్‌ ఓకే అవ్వడంతో.. జూలై నుంచి ఈ మూవీని సెట్స్ పైకి వెళ్లనుందని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Brahmaji: చైనా అధ్య‌క్షుడిని క‌లిసిన బ్ర‌హ్మాజీ.. మా ఎన్నిక‌ల‌పై చ‌ర్చ‌.. వైర‌ల్‌గా మారిన ఇన్‌స్టా పోస్ట్‌..

వర్మ కు వచ్చిన అతి పెద్ద డౌట్.. పాపం అవి కూడా ప్రాణులే వాటికి కూడా మనోభావాలుంటాయి .

Harish Pawan: బ‌ద్రిని మ‌రోసారి ప‌రిచ‌యం చేయ‌నున్న హ‌రీష్ శంక‌ర్‌.. ప‌వ‌న్ 28వ చిత్రానికి సంబంధించి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu