The Girlfriend Twitter Review: ది గర్ల్ ఫ్రెండ్ ట్విట్టర్ రివ్యూ.. రష్మిక మందన్న సినిమాపై పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే..

కొన్నాళ్లుగా వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లతో ఫుల్ జోష్ మీదుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. యానిమల్, పుష్ప 2, ఛావా, కుబేర, థామా ఇలా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. తెలుగు, హిందీలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ అంటూ మరోసారి అడియన్స్ ముందుకు వచ్చేసింది.

The Girlfriend Twitter Review: ది గర్ల్ ఫ్రెండ్ ట్విట్టర్ రివ్యూ.. రష్మిక మందన్న సినిమాపై పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే..
Cinema (7)

Updated on: Nov 07, 2025 | 6:47 AM

ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్న. తెలుగు, హిందీ భాషలలో వరుస హిట్లతో ఫుల్ జోష్ మీదున్న ఈ అమ్మడు.. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటివరకు ఈ అమ్మడు నటించిన చిత్రాలన్నీ భారీగా కలెక్షన్స్ రాబడుతున్నాయి. ఇటీవలే హారర్ థ్రిల్లర్ థామా సినిమాతో మరో హిట్టు ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ అంటూ అడియన్స్ ముందుకు వచ్చేసింది.ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్ఫణలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని విద్య కొప్పినీడు, ధీరజ్ మొగిలినేని నిర్మించారు. ఈ చిత్రానికి నటుడు కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించగా.. కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి హీరోగా నటించారు. అలాగే అను ఇమ్మాన్యుయేల్, రావు రమేష్, రోహిణి తదితరులు కీలకపాత్రలు పోషించారు.

ఇవి కూడా చదవండి : Meenakshi Chaudhari: ఆ హీరో సినిమాలో నటించి తప్పు చేశాను.. వారం రోజులు అలాంటి బాధ.. మీనాక్షి చౌదరి..

విడుదలకు ముందే పాటలు, టీజర్, ట్రైలర్ ద్వారా మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. ఇప్పుడు నవంబర్ 7న గ్రాండ్ గా థియేటర్లలో విడుదలైంది. కానీ ఈ మూవీకి సంబంధించిన ప్రీమియర్ షోస్ మాత్రం నవంబర్ 6న రాత్రి నుంచి ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ది గర్ల్ ఫ్రెండ్ సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు. ఇంతకీ ది గర్ల్ ఫ్రెండ్ సినిమా పై జనాలు ఏమంటున్నారో తెలుసుకుందామా.

ది గర్ల్ ఫ్రెండ్ సినిమా డీసెంట్ లవ్ స్టోరీ.. రష్మిక మరోసారి యాక్టింగ్ అదరగొట్టింది. ఇంటర్వెల్ లో ఇన్‌సెక్యూర్ లవ్ స్టోరీని చాలా బాగా చూపించారని అంటున్నారు. ముఖ్యంగా చివరి 10 నిమిషాలు రష్మిక నట విస్పోటనం చూపించిందని కామెంట్ చేస్తున్నారు. డీసెంట్ లవ్ స్టోరీ, గుడ్ యాక్టింగ్.. గుడ్ ఇంటర్వెల్.. రాహుల్ రవింద్రన్ రైటింగ్, డైరెక్షన్ బాగుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. చివరి 30 నిమిషాల్లో రష్మిక యాక్టింగ్ అదిరిపోయిందని.. దీక్షిత్ శెట్టి తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు.

ఇవి కూడా చదవండి :  Cinema : 64 ఏళ్ల హీరో సరసన 27 ఏళ్ల హీరోయిన్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..