ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో ఫుల్ బిజీ హీరోయిన్లలో రష్మిక మందన్న ఒకరు. విభిన్నమైన కథా చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా తర్వాత రష్మిక క్రేజ్ మారిపోయింది. తెలుగుతోపాటు అటు హిందీలోనూ వరుస ఆఫర్స్ అందుకుంటూ అగ్రకథానాయికగా కొనసాగుతుంది. ప్రస్తుతం యానిమల్ పార్క్, పుష్ప 2, గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. ఇటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా తాను నటించిన ఓ సినిమా గురించి ఆసక్తికర పోస్ట్ చేసింది. ఆ సినిమా విడుదలై నేటికి ఐదేళ్లు పూర్తైన ప్రేక్షకులు ఇప్పటికీ తనను లిల్లీగానే గుర్తుపెట్టుకున్నారని.. ఎమోషనల్ పోస్ట్ చేసింది. తన పాత్రను అంతగా ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది. ఇంతకీ ఆ సినిమా ఏంటీ అనుకుంటున్నారా..? అదే డియర్ కామ్రేడ్.
విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన సినిమా డియర్ కామ్రేడ్. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019లో విడుదలై మంచి రివ్యూస్ అందుకుంది. కానీ కమర్షియల్ హిట్ కాలేకపోయింది. గీతా గోవిందం తర్వాత వీరిద్దరు కలిసి నటించిన సినిమా ఇదే. ఇందులో రష్మిక లిల్లీ పాత్రలో కనిపించి అలరించారు. ఈ సినిమా విడుదలై నేటికి ఐదేళ్లు.. ఈ సందర్బంగా తన ఇన్ స్టాలో డియర్ కామ్రేడ్ సినిమా గురించి ఆసక్తికర పోస్ట్ చేసింది. “డియర్ కామ్రేడ్ సినిమాను అభిమానించిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పటికీ దీనిని ఆదరిస్తున్నందుకు సంతోషిస్తున్నాను. స్క్రిప్ట్ నెరేషన్ తో మొదలైన ఈ ప్రయాణంలో నెలలపాటు క్రికెట్ ట్రైనింగ్, గాయాలు, నవ్వులతో సాగిన షూట్.. చిత్రీకరణ పూర్తైన రోజు భావోద్వేగ క్షణాలున్నాయి. ఈ సినిమా తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించినప్పటికీ ఇప్పటికీ ప్రేక్షకులు నన్ను లిల్లీగానే గుర్తుపెట్టుకున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి క్షణం నాకెంతో ప్రత్యేకం. భరత్, విజయ్ దేవరకొండతోపాటు చిత్రయూనిట్ కు ధన్యవాదాలు” అంటూ సుధీర్ఘ నోట్ రాసుకొచ్చింది. ప్రస్తుతం రష్మిక చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రష్మిక పుష్ప 2 చిత్రంలో శ్రీవల్లీ పాత్రలో నటిస్తుంది. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వహిస్తున్న ఈ మూవీ ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. అలాగే లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ ఈ కన్నడ బ్యూటీ నటిస్తున్న సంగతి తెలిసిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.