
నేషనల్ క్రష్ రష్మిక మందన్న సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా తన సినిమాల అప్డేట్స్ తో పాటు తన పర్సనల్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ అమ్మడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం కన్నడ, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఈ అమ్మడికి అభిమానులున్నారు. తాజాగా రష్మిక అటల్ సేతు గురించి గొప్పగా మాట్లాడింది. దాంతో రష్మిక చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 22 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 20 నిమిషాల్లోనే రీచ్ అయ్యాను అంటూ ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఈ ట్వీట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ రీట్వీట్ చేశారు .
భారతదేశంలోనే అతి పొడవైన సముద్ర వంతెనగా అటల్ సేతుకు మంచి గుర్తింపు దక్కింది. ఈ వంతెన ముంబై , నవీ ముంబైలను కలుపుతుంది. దీనిపై రష్మిక ప్రశంసల వర్షం కురిపించింది. దీని గురించి రష్మిక మాట్లాడుతూ.. ‘భారతదేశంలోనే అతి పొడవైన సముద్ర వంతెన ఇది. దీని పొడవు 22 కిలోమీటర్లు. రెండు గంటల ప్రయాణం ఇప్పుడు 20 నిమిషాల్లో ముగిసింది. నమ్మశక్యం కానిది. కొన్నేళ్ల క్రితం ఎవరూ ఊహించలేరు’ అని రష్మిక చాలా గొప్పగా చెప్పుకొచ్చింది.
భారతదేశం పెద్దగా కలలు కనదని చెప్పేవారు. అయితే ఈ పెద్ద వంతెనను ఏడేళ్లలో నిర్మించాం. అటల్ సేతు ఒక వంతెన మాత్రమే కాదు, ఇది యువ భారతదేశానికి ఒక హామీ. ఇలాంటి 100 అటల్ బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలి అంటే అభివృద్ధికి ఓటేయాలని రష్మిక అన్నారు. ఈ వీడియోకు ‘దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశానికి, తూర్పు భారతదేశం నుంచి పశ్చిమ భారతదేశానికి ప్రజలను మరియు హృదయాలను కనెక్ట్ చేసింది’ అని క్యాప్షన్ ఇచ్చారు. దీన్ని రీట్వీట్ చేసిన మోదీ.. ‘ప్రజలను కనెక్ట్ చేయడం, జీవితాలను మెరుగుపరచడం కంటే సంతృప్తికరమైనది మరొకటి లేదు’ అని రాసుకొచ్చారు. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Absolutely! Nothing more satisfying than connecting people and improving lives. https://t.co/GZ3gbLN2bb
— Narendra Modi (@narendramodi) May 16, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.