AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: పుష్ప 2పై కీలక అప్డేట్ ఇచ్చిన శ్రీవల్లి.. అప్పుడే సెట్‌లోకి అడుగుపెడతానంటూ..

Pushpa 2: టాలీవుడ్ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun), రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం పుష్ప: ది రైజ్‌. సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సూపర్‌డూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా రెండో పార్ట్‌ పుష్ప: ది రూల్‌ త్వరలోనే ప్రారంభం కానుంది.

Rashmika Mandanna: పుష్ప 2పై కీలక అప్డేట్ ఇచ్చిన శ్రీవల్లి.. అప్పుడే సెట్‌లోకి అడుగుపెడతానంటూ..
Rashmika Mandanna
Basha Shek
|

Updated on: Sep 07, 2022 | 11:04 AM

Share

Pushpa 2: టాలీవుడ్ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun), రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం పుష్ప: ది రైజ్‌. సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సూపర్‌డూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా రెండో పార్ట్‌ పుష్ప: ది రూల్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. కాగా ఈ సినిమా షెడ్యూల్‌కు సంబంధించి రష్మిక ఓ కీలక అప్డేట్‌ ఇచ్చింది. మరో రెండురోజుల్లో పుష్ప సీక్వెల్‌ షూటింగ్‌లో జాయిన్‌ కానున్నట్లు తెలిపింది. ఇదిలా ఉంటే రష్మిక ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గుడ్‌బై (Good Bye). బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్‌ 7న థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది.

కాగా ఈ చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొన్న రష్మిక పలు ఆసక్తికర కామెంట్లు చేసింది. ‘మీ జీవితంలో ఏ విషయానికి గుడ్‌ బై చెప్పాలనుకుంటున్నారు’ అని ఓ విలేకరి అడగ్గా.. ‘నెగెటివ్‌ ఆలోచనలకు గుడ్‌ బై చెప్పాలనుకుంటున్నాను’ అని సమాధానమిచ్చింది. ‘నేను చాలా పాజిటివ్‌ పర్సన్‌ని. దేన్నైనా సానుకూల దృక్పథంతో ఆలోచిస్తాను. మనందరం కూడా నెగిటివిటీకి గుడ్‌ బై చెప్పాలి. ఈ ప్రపంచమంతా పాజిటివ్‌ నెస్‌తో నిండిపోవాలని ఆకాంక్షిస్తున్నా’ అని చెప్పుకొచ్చింది రష్మిక. కాగా గుడ్‌బైతో పాటు హిందీలో మిషన్‌ మజ్ఞు, యానిమల్‌ చిత్రాల్లోనూ నటిస్తోంది రష్మిక. అలాగే తెలుగులో వారసుడు సినిమాలో విజయ్‌ సరసన హీరోయిన్‌గా కనిపించనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
2,800 ఏళ్ల నాటి వేణువు.. ‘ఒడిస్సీ’ సినిమా సంగీతంతో పోలిక!
2,800 ఏళ్ల నాటి వేణువు.. ‘ఒడిస్సీ’ సినిమా సంగీతంతో పోలిక!
యాపిల్ నుంచి ఫస్ట్‌ టచ్‌స్క్రీన్‌తో మ్యాక్‌బుక్ ప్రో..
యాపిల్ నుంచి ఫస్ట్‌ టచ్‌స్క్రీన్‌తో మ్యాక్‌బుక్ ప్రో..
ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. దీపావళి గిఫ్ట్ ఇదే..
ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. దీపావళి గిఫ్ట్ ఇదే..
కర్వా చౌత్.. వీరవతి, కర్వామాత, శివపార్వతుల వ్రత కథలు.. ఇలా చేస్తే
కర్వా చౌత్.. వీరవతి, కర్వామాత, శివపార్వతుల వ్రత కథలు.. ఇలా చేస్తే
భోజనం చేసిన వెంటనే స్నానం చేస్తే జీర్ణక్రియ మందగిస్తుందా?నిపుణులు
భోజనం చేసిన వెంటనే స్నానం చేస్తే జీర్ణక్రియ మందగిస్తుందా?నిపుణులు
క్యాన్సర్ రోగులకు ఉపశమనం: 543 రకాల మందుల ధరలు భారీగా తగ్గింపు
క్యాన్సర్ రోగులకు ఉపశమనం: 543 రకాల మందుల ధరలు భారీగా తగ్గింపు
త్వరలో భారత్‌లో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఏ విధంగా తయారవుతాయంటే
త్వరలో భారత్‌లో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఏ విధంగా తయారవుతాయంటే
నవంబర్ 1 నుంచి గ్యాస్ సిలిండర్లకు కొత్త రూల్స్.. ఇవి తప్పనిసరి
నవంబర్ 1 నుంచి గ్యాస్ సిలిండర్లకు కొత్త రూల్స్.. ఇవి తప్పనిసరి
దీపావళికి ఇల్లు క్లీన్ చేస్తున్న యజమాని.. కిటికీ ఓపెన్ చేయగా..
దీపావళికి ఇల్లు క్లీన్ చేస్తున్న యజమాని.. కిటికీ ఓపెన్ చేయగా..
పన్నీర్‌పై ప్రభుత్వం సంచలన నిర్ణయం.. అమ్మకాలపై ఏడాదిపాటు బ్యాన్..
పన్నీర్‌పై ప్రభుత్వం సంచలన నిర్ణయం.. అమ్మకాలపై ఏడాదిపాటు బ్యాన్..