Rashmika Mandanna: వివాదంలో రష్మిక మందన్నా సినిమా.. ఎందుకంటే..

|

Jan 26, 2025 | 12:57 PM

కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫుల్ జోష్ మీదున్న సంగతి తెలిసిందే. గతేడాది యానిమల్, పుష్ప 2 చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ఈ అమ్మడు..ఇప్పుడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. హిందీలో వరుస ఆఫర్స్ అందుకున్న ఈ బ్యూటీకి ఇప్పుడు షాక్ తగిలింది.

Rashmika Mandanna: వివాదంలో రష్మిక మందన్నా సినిమా.. ఎందుకంటే..
Rashmika Mandanna
Follow us on

పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్నా, విక్కీ కౌశల్ జంటగా నటించిన చిత్రం ఛవా. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని కలిగించింది. ఇన్నాళ్లు వేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 14న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ కుమారుడు సాంబాజీ మహరాజ్‌ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అయితే ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ పై కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఛత్రపతి శివాజీ వారసులు సినిమా చారిత్రక స్పష్టత, ఖచ్చితత్వంపై సందేహాలు వ్యక్తం చేశారు. అంతే కాకుండా కొందరు మరాఠీలు ‘ఛావా’ సినిమాపై నిరసనలు వ్యక్తం చేస్తూ సినిమా విడుదలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు, రాజ్యసభ సభ్యుడు కూడా అయిన సాంబాజీ రాజే ఛత్రపతి ‘చావా’ సినిమా గురించి మీడియాతో మాట్లాడుతూ “సినిమా దర్శకుడు చరిత్రకారులను సంప్రదించాలి. సాంబాజీ మహారాజ్ గురించి సరిగ్గా తెలుసుకోవాలి. అతనిని గౌరవప్రదంగా, ఖచ్చితంగా తెరపైకి తీసుకురా. సాంబాజీ మహారాజ్ సాధించిన విజయాలపై సినిమా తీయడం మంచి విషయమని, సినిమా విడుదలకు ముందు జరిగిన పొరపాట్లను కూడా సరిదిద్దుకోవాలని అన్నారు.

కొన్ని మరాఠా సంఘాలు పూణే, ముంబై తదితర ప్రాంతాల్లో ‘చావా’ సినిమాకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపాయి. ఇప్పుడు విడుదలైన ‘చావా’ సినిమా ట్రైలర్‌లో ఓ డ్యాన్స్ సీన్ ఉంది. రష్మిక మందన్న, విక్కీ కౌశల్ డ్యాన్స్ చేస్తున్న సీన్ ఇదే, మరాఠీ ప్రజలు ఈ సీన్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మహారాజ్ బహిరంగంగా డ్యాన్స్ చేస్తున్న దృశ్యం అతని వ్యక్తిత్వానికి విరుద్ధంగా ఉందని. సినిమాలో చూపించినట్లుగా, పట్టాభిషేకం తర్వాత ఇలా డ్యాన్స్ చేస్తూ చూపించారు. ఆ సీన్‌ను సినిమా నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. శివాజీ మహారాజ్ కుమారుడు సాంబాజీ మహరాజ్ కథతో తెరకెక్కిన చిత్రం ‘చావా’. సాంబాజీ భార్య మహారాణి యేసుబాయి పాత్రలో నటి రష్మిక మందన్న నటిస్తోంది. లక్ష్మణ్ ఉతేకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..