ప్రస్తుతం ఫుల్ జోష్లో దూసుకుపోతుంది కన్నడ బ్యూటీ శ్రీవల్లి (Rashmika Mandanna). పుష్ప మూవీతో పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న ఈ చిన్నది.. ఇక ఇప్పుడు తెలుగుతోపాటు.. హిందీ, తమిళ్ భాషలలో వరుస ఆఫర్లతో రాణిస్తుంది. ఇప్పటికే హిందీలో మూడు ప్రాజెక్ట్స్ చేస్తోన్న రష్మిక.. తమిళంలో విజయ్ దళపతి సరసన వరిసు మూవీలో నటిస్తోంది. ఇక తెలుగులో పుష్ప సిక్వెల్ పుష్ప 2లోనూ నటిస్తోంది. అంతేకాకుండా ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ కొరటాల శివ సినిమాలోనూ నేషనల్ క్రష్ సెలక్ట్ అయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీలో జాన్వీ కపూర్, అలియా భట్, దీపికా అంటూ పేర్లు వినిపించిన సంగతి తెలిసిందే. లేటేస్ట్ అప్డేట్ ప్రకారం ఈ మూవీలో తారక్ జోడిగా రష్మికను ఫైనల్ చేశారంట మేకర్స్. ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
అయితే ఈ సినిమా కోసం రష్మిక ఏకంగా రూ. 5 కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పారితోషికాన్ని డబుల్ చేసిందట. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద్ మోస్ట్ డిమాండ్ హీరోయిన్ రష్మికనే కావడం విశేషం. అంతేకాదు.. దక్షిణాదిలో అత్యథిక ఫాలోవర్లు కలిగిన హీరోయిన్ కూడా ఈమెనే. ఇక రష్మికకు రూ. 5 కోట్లు పారితోషికం ఇచ్చేందుకు మేకర్స్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాక్. ఇక ఎన్టీఆర్, కొరటాల శివ ప్రాజెక్ట్ గురించి ఎప్పుటికప్పుడు పలు అప్డేట్స్ నెట్టింట వైరలవుతున్న సంగతి తెలిసిందే.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.