
టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ, రష్మిక యవ్వారం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరి మధ్య ఎదో ఉంది అంటూ ఎప్పటి నుంచో వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని .. కలిసి చక్కర్లు కొడుతున్నారని ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా రకాల వార్తలు వచ్చాయి. తాజాగా మరోసారి విజయ్, రష్మిక కలిసి కనిపించారు. అవును విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న మళ్ళీ కలిసి కనిపించడంతో, వారిద్దరి మధ్య సంబంధం గురించి పుకార్లు నిజమేనా అనిపిస్తున్నాయి. వీరు ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు, అప్పటి నుండి వారిద్దరి మధ్య చాలా సన్నిహిత స్నేహం ఉంది. కొందరు అభిమానులు, మీడియా వర్గాల్లో, వీరు ఇద్దరూ ప్రేమలో ఉన్నారని రహస్యంగా కలుసుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన ఆన్‌స్క్రీన్ జోడీ విజయ్ దేవరకొండ, రష్మిక. వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నట్లు ఎంతో కాలం నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ జోడీ మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. ముంబయి విమానాశ్రయంలో వీరిద్దరూ కలిసి కనిపించారు. రష్మిక, విజయ్ ఒకే కారులో పక్కపక్కన కూర్చొని ప్రయాణించారు. ఈ దృశ్యాలను ఫొటోగ్రాఫర్‌లు క్లిక్‌మనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో వీళ్లు రిలేషన్‌లోనే ఉన్నారనే వార్తలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి.
వీరిద్దరూ వారి సినిమాల విడుదలకు ముందు ఒకరినొకరు అభినందించుకోవడం ఆనవాయితీ. రష్మిక నటించిన ‘కుబేర’ విడుదలకు సిద్ధం కావడంతో విజయ్ ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతూ తాజాగా పోస్ట్ పెట్టారు. కుబేర టీమ్‌కు శుభాకాంక్షలు. నా కెరీర్‌లో దర్శకుడు శేఖర్ కమ్ములకు ప్రత్యేక స్థానం ఉంటుంది. నాలాంటి ఎంతో మంది నటుల ఆశలను ఆయన నిజం చేశారు. నా అభిమాన తారలు నటించిన ఈ సినిమాను బిగ్‌స్క్రీన్‌పై చూడడం కోసం ఆసక్తిగా ఉన్నాను అని పోస్ట్ పెట్టారు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘కింగ్‌డమ్’తో బిజీగా ఉన్నారు. దీనితో పాటు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా రానున్న ఈ సినిమాలో రష్మిక కథానాయికగా కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే ముచ్చటగా మూడోసారి ఈ జోడీని చూడొచ్చని సంబరపడుతున్నారు అభిమానులు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి