అపర కుబేరుడు ముకేశ్ అంబానీ చిన్న తనయుడు అనంత్ అంబానీ పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది. గతంలోనే నిశ్చితార్థం చేసుకున్న అనంత్ అంబానీ- రాధిక మర్చెంట్ జులై 12 వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఈ వివాహ వేడుకకు దేశ విదేశాల నుంచి అతిరథ మహారథులు తరలి వచ్చారు. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ నుంచి కూడా పలువురు సినీ ప్రముఖులు అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో భాగమయ్యారు. నూతన వధూవరులను అశీర్వదించారు. కాగా ఈ పెళ్లి వేడుకల్లో భాగంగా జరిగిన బరాత్‌లో బాలీవుడ్ స్టార్ హీరో, దీపికా పదుకొణె భర్త రణ్‌వీర్ సింగ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ ఎంతో చలాకీగా ఉండే ఈ హీరో అనంత్ అంబానీ పెళ్లిలోనూ హంగామా చేశాడు. నాగిని డ్యాన్స్ చేస్తూ అతిథులను అలరించాడు. అతనికి తోటి హీరోలు అర్జున్ కపూర్, వీర్ పహారియా కూడా తోడయ్యాడు. అందరూ కలిసి హుషారుగా స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు.
కాగా అనంత్ అంబానీ- రాధిక మర్చెంట్ ల వివాహ వేడుకకు భార్య దీపికా పదుకొణెతో కలిసి హజరయ్యాడు రణ్ వీర్ సింగ్. అలాగే ప్రియాంక చోప్రా- నిక్ జొనస్, షారుఖ్ ఖాన్- గౌరీఖాన్, అలియా భట్, రణ్ బీర్ కపూర్, సల్మాన్ ఖాన్, మహేశ్ బాబు, నమ్రతా శిరోద్కర్, రామ్ చరణ్, ఉపాసన కొణిదెల, అనన్యా పాండే, అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, పవన్ కల్యాణ్, అక్కినేని అఖిల్, వెంకటేశ్, సారా అలీఖాన్, జాన్వీ కపూర్, సూర్య, జ్యోతిక, రజనీకాంత్ సహా పలువురు సినిమా తారలు అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో తళుక్కుమన్నారు. వీరికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.