
ఇండస్ట్రీలో చాలా మంది తారలకు కార్లంటే విపరీతమైన ఆసక్తి ఉంటుంది. నిత్యం కొత్త కొత్త కార్లు కొనుగోలు చేస్తుంటారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషలకు చెందిన పలువురు స్టార్స్ వద్ద ఇప్పటికే ఎన్నో రకాల బ్రాండ్ లగ్జరీ కార్లు ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ హీరో నాలుగున్నర కోట్లు కోట్లు పెట్టి కొత్తగా ఎలక్ట్రిక్ హమ్మర్ కొన్నారు. ఇప్పుడు ఆ కారు ఫీచర్స్ తెలిసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ? అతడే బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్. ఆయనకు కార్లంటే విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పటికే ఆయన వద్ద బెంట్లీ, రేంజ్ రోవర్ వంటి కార్లు ఉన్నాయి. ఇప్పుడు అతని గ్యారేజీకి కొత్త కారు వచ్చి చేరింది. అదే హమ్మర్ EV 3X కారు. ఈ కారు విలువ సరిగ్గా నాలుగున్నర కోట్ల రూపాయలు.
రణవీర్ దగ్గర చాలా రకాల కార్లు ఉన్నాయి. కానీ, అతను ఎప్పుడూ ఎలక్ట్రిక్ కారు కొనలేదు. ఇప్పుడు తన పేరు మీద హమ్మర్ కొన్నాడు. ఈ కారును అతని ముంబై నివాసానికి డెలివరీ చేశారు. ఈ కారులో చాలా ఫీచర్లు ఉన్నాయి. రణ్‌వీర్ కొన్న హమ్మర్ ఖరీదైన కారు, దాని ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.85 కోట్లు. పన్నులు, ఇతర అంశాలను కలుపుకుంటే, దాని ధర రూ. 4.57 కోట్లు అవుతుంది. హమ్మర్ EV 3X అనేది సాధారణ కారు కాదు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 500 కి.మీ ప్రయాణించగలదు. దీనికి 830 హార్స్‌పవర్ ఉంటుంది. ఈ కారులో 11,500 టార్క్ ఉంటుంది. ఎలక్ట్రిక్ కారులో ఇన్ని ఫీచర్లు ఇదే మొదటిది.
ఈ కారుకు సూపర్ క్రూయిజ్ లాంటి టెక్నాలజీ ఉంది. ఈ కారు తెలుపు, ఎరుపు మరిన్నింటితో సహా ఏడు రంగులలో లభిస్తుంది. ఇది పొడవైన కారు అయినప్పటికీ దీనిలో ఐదుగురు మాత్రమే కూర్చోగలరు. విలాసవంతమైన అనుభూతిని కలిగించడానికి ఇది తయారు చేశారు. ఈ కారులో ఆరు ఎయిర్‌బ్యాగులు ఉన్నాయి. ఈ కారులో 14 స్పీకర్లు ఉన్నాయి.
Ranveer Singh News
ఇవి కూడా చదవండి :
Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..
Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..
Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..