
Rana Daggubati : యంగ్ హీరో రానా ప్రస్తుతం వరుస సినిమాలను లైనప్ చేశారు. మొన్నామధ్య అరణ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రానా. ఈ సినిమా తెలుగు తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ అయ్యింది. అడవి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. ఆ తర్వాత రానా నటించిన సినిమా ‘1945’ . మొదటి నుంచి రానా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వస్తున్నాడు. అలాప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమానే 1945. సత్యశివ రూపొందించిన ఈ సినిమాను సి.కల్యాణ్ నిర్మించారు.ఈ సినిమా ఇటీవలే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎప్పుడు తెరకెక్కిన రిలీజ్ మాత్రం లెట్ చేశారు. అంతే కాకుండా విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్స్ కూడా చేయలేదు.
దాంతో ఈ సినిమా ప్రేక్షకులకు అంతగా ఎక్కలేదనే చెప్పాలి. దాంతో ఈ సినిమా ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకురానున్నారు. సన్ నెక్స్ట్ లో ఈ నెల 7వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో రానా సరసనఅందాల భామ రెజీనా నటించింది. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఇక రానా నటించిన విరాటపర్వం సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. వేణు ఉడుగుల దర్శకత్వం వచ్చిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. రానా నక్సలైట్ గా ఈ సినిమాలో కనిపించనున్నాడు. అలాగే ప్రియమణి కీలక పాత్ర పోషించారు.
మరిన్ని ఇక్కడ చదవండి :