Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి విలన్‏గా టాలీవుడ్ స్టార్ హీరో.. ‘మెగా 156’లో భల్లాలదేవ ?..

ప్రస్తుతం డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. మెగా 156 వర్కింగ్ టైటిల్‏తో రాబోతున్న ఈ సినిమాను దసరా సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. మరోవైపు ఈ మూవీ మ్యూజిక్ వర్క్స్ స్టార్ట్ చేశారు. బింబిసార సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న వశిష్ట.. రెండో సినిమా ఛాన్స్ ఏకంగా చిరుతో చేయబోతున్నారు. దీంతో ఈ మూవీపై ఇప్పటికే మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి విలన్‏గా టాలీవుడ్ స్టార్ హీరో.. మెగా 156లో భల్లాలదేవ ?..
Chiranjeevi, Rana

Updated on: Oct 25, 2023 | 4:14 PM

ఇటీవలే భోళా శంకర్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన చిరంజీవి.. విజయం మాత్రం అందుకోలేకపోయారు. దీంతో ఇప్పుడు ఆయన తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై మరింత ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. మెగా 156 వర్కింగ్ టైటిల్‏తో రాబోతున్న ఈ సినిమాను దసరా సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. మరోవైపు ఈ మూవీ మ్యూజిక్ వర్క్స్ స్టార్ట్ చేశారు. బింబిసార సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న వశిష్ట.. రెండో సినిమా ఛాన్స్ ఏకంగా చిరుతో చేయబోతున్నారు. దీంతో ఈ మూవీపై ఇప్పటికే మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ హీరో రానా దగ్గుబాటి నటిస్తున్నారని తెలుస్తోంది. అంతేకాదు.. ఈ మూవీలో చిరుకు ప్రతినాయకుడిగా రానా కనిపించనున్నారు టాక్ నడుస్తోంది. దీంతో ఈ మూవీపై మరింత హైప్ ఏర్పడింది. లీడర్ సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయమైన రానా.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. హీరోగా కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే బాహుబలి సినిమాలో భల్లాలదేవ పాత్రలో నటించి మెప్పించారు. ఈ మూవీలో ప్రభాస్‏ను ఢీకొట్టే విలన్ పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్నారు. దీంతో రానాకు విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ఇక ఇప్పుడు ఏకంగా చిరు ను ఢీకొట్టే విలన్ గా రానా కనిపించబోతున్నారని తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

రానా చివరిసారిగా విరాటపర్వం చిత్రంలో కనిపించారు. న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి నటించిన ఈ మూవీలో ముఖ్య పాత్ర పోషించారు రానా. ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్ లో రానా నాయుడు వెబ్ సిరీస్‏లో కనిపించారు. ప్రస్తుతం రానా నిర్మాతగా రాణిస్తున్నారు.