- Telugu News Photo Gallery Cinema photos Teja Sajja and Prasanth varma Hanuman Movie Release date announce to sankranthi 2024 race Telugu Entertainment Photos
Hanuman: హనుమాన్ నమ్మకం అదేనా.. సంక్రాంతికి రావడంలో ఏంటి ధైర్యం..?
సంక్రాంతికి అరడజన్ సినిమాలకు పైగానే వస్తున్నాయి. అందులో అన్నీ మూడు రోజుల గ్యాప్‌లోనే విడుదల కానున్నాయి. దాంతో అసలు పండగ రేసు ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. ఈ క్రమంలోనే గుంటూరు కారం జనవరి 12న రావడం ఫిక్స్.. ఆ మరుసటి రోజే సైంధవ్ రాబోతుంది. జనవరి 14న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ విడుదల కానుంది. ఈ మూడు సినిమాలు అయితే పక్కాగా వస్తున్నాయి.
Updated on: Oct 25, 2023 | 4:04 PM

సంక్రాంతికి అరడజన్ సినిమాలకు పైగానే వస్తున్నాయి. అందులో అన్నీ మూడు రోజుల గ్యాప్‌లోనే విడుదల కానున్నాయి. దాంతో అసలు పండగ రేసు ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. ఈ క్రమంలోనే గుంటూరు కారం జనవరి 12న రావడం ఫిక్స్.. ఆ మరుసటి రోజే సైంధవ్ రాబోతుంది.

జనవరి 14న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ విడుదల కానుంది. ఈ మూడు సినిమాలు అయితే పక్కాగా వస్తున్నాయి. సితార ఎంటర్‌టైన్మెంట్స్, దిల్ రాజు, సురేష్ బాబు లాంటి నిర్మాతలు ఈ సినిమాల వెంట ఉన్నారు కాబట్టి థియేటర్స్ ఇష్యూ కూడా ఉండకపోవచ్చు.

మరోవైపు అన్ని సినిమాలకు ఒక్కో రోజు గ్యాప్ ఉంది కాబట్టి ముందు వచ్చిన సినిమా బాగుంటే అదే జోరు తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది. ఇదే క్రమంలోనే సంక్రాంతికి మరిన్ని సినమాలు కూడా లైన్‌లోనే ఉన్నాయి. అవే హనుమాన్, ఈగిల్, నా సామిరంగా.

మరోవైపు అన్ని సినిమాలకు ఒక్కో రోజు గ్యాప్ ఉంది కాబట్టి ముందు వచ్చిన సినిమా బాగుంటే అదే జోరు తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది. ఇదే క్రమంలోనే సంక్రాంతికి మరిన్ని సినమాలు కూడా లైన్‌లోనే ఉన్నాయి. అవే హనుమాన్, ఈగిల్, నా సామిరంగా.

ఈ రెండు సినిమాలను పక్కనబెడితే హనుమాన్ మాత్రం పక్కాగా పండక్కే వస్తుందని మరోసారి కన్ఫర్మ్ చేసారు దర్శక నిర్మాతలు. పండక్కి వచ్చే వాటిలో చిన్న సినిమా ఇదే.. తేజ సజ్జ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకుడు. ఈ సినిమా కచ్చితంగా సంక్రాంతికే వస్తుందని మరోసారి ఖరారు చేసారు మేకర్స్.

దసరా పోస్టర్‌లో జనవరి 12న విడుదల అని కన్ఫర్మ్ చేసారు. అందులో మీసం తిప్పుతూ కనిపించాడు తేజ. దీన్నిబట్టి ఎన్ని సినిమాలు వచ్చినా కూడా తగ్గేదే లే అని ఫిక్సైనట్లు తెలుస్తుంది. సోషియో ఫాంటసీగా వస్తున్న హనుమాన్‌పై అంచనాలు బాగానే ఉన్నాయి.

20 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్ వర్మ. తేజపై ఈ బడ్జెట్ ఎక్కువని తెలుసు కానీ కథ డిమాండ్ చేయడంతో ధైర్యం చేసారు. అంతేకాదు.. సంక్రాంతికి చిన్న సినిమాలకు ఎప్పుడూ అడ్వాంటేజ్ ఉంటుంది.

భారీ సినిమాలు ఏ మాత్రం తేడాగా ఉన్నా ప్రేక్షకుల చూపు చిన్న సినిమాల వైపు పడుతుంది. పాజిటివ్ టాక్ వస్తే చాలు కచ్చితంగా పండగ చేసుకోవచ్చు. ఈ ధైర్యంతోనే హనుమాన్ సినిమాను తీసుకొస్తున్నారు దర్శక నిర్మాతలు.





























